newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ఈరోజే ఢిల్లీలో వియ్యంకుడి ఇంట్లో విందు.. వైసీపీలో టెన్షన్

11-12-201911-12-2019 13:33:53 IST
Updated On 11-12-2019 14:12:31 ISTUpdated On 11-12-20192019-12-11T08:03:53.170Z11-12-2019 2019-12-11T08:03:49.875Z - 2019-12-11T08:42:31.050Z - 11-12-2019

ఈరోజే ఢిల్లీలో వియ్యంకుడి ఇంట్లో విందు..  వైసీపీలో టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈరోజు ఢిల్లీలో ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ఎందుకోసం అన్నది పక్కనపెడితే.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అయిన అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్రమంత్రులు, ఢిల్లీలో రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ విందుపైనే పడింది.

కొద్దిగా వెనక్కు వెళ్తే ఆ మధ్య పార్లమెంటులో ప్రధాని మోడీ ఈ ఎంపీ రాజు గారినే భుజం తట్టి ఏంటి రాజు గారూ ఎలా ఉన్నారని ఆప్యాయంగా పలకరించారు. అప్పుడే ఇది ఢిల్లీ నుండి అమరావతి గల్లీలో వైబ్రేషన్స్ మొదలయ్యాయని చెప్పుకున్నారు. ఎందుకంటే అప్పటికే సీఎం జగన్ తన పార్టీ ఎంపీలు తమ అనుమతి లేకుండా కేంద్రంలో ఎవరినీ కలిసేందుకు లేదని హుకుం జారీచేసినా రాజుగారు ప్రధానితో ముచ్చట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ తర్వాత ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని పిలిచి జగన్ సంజాయిషీ కోరారని కూడా ప్రచారం జరిగింది. అయితే అంతకు మించి ఎంపీ కాషాయం గూటికి చేరడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. మరి ఈ ఎంపీనే ఈరోజు విందు ఏర్పాటు చేయడం.. అది కూడా భారీగా స్థాయిలో ఏర్పాట్లు.. అందులో వందకు పైగా వంటకాలు.. అదే స్థాయిలో పెద్దలు, ప్రముఖుల రాకతో సహజంగానే చర్చ మొదలైంది.

నిజానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు బీజేపీలోకి వెళ్తారని దాదాపు నెల క్రితమే రెండు పార్టీల నేతలకు క్లారిటీ ఉంది. వైసీపీ అధిష్టానం కూడా ఈమేరకు కొంత ఆశలు కూడా వదిలేసుకొని.. అంతకు అంతగా ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబాన్ని బీజేపీ నుండి తమ పార్టీలోకి లాగేసుకుందని ప్రచారం సాగుతుంది. కానీ ఇప్పుడు కృష్ణరాజు పార్టీ జంపింగ్ ను మించి వైసీపీలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది.

ఈ విందు తర్వాత ఏపీ వైసీపీ ఎంపీలు నలుగురు బీజేపీ గూటికి చేరినా ఆశ్చర్యం లేదని సాగుతున్న మరో ప్రచారమే ఇప్పుడు వైసీపీ పెద్ద టెన్షన్ కి కారణం. నిజానికి ఎంపీ గోకరాజు కుటుంబం కరుడుగట్టిన కాషాయ వాదులు. అలాంటిది ఒక్క ఎంపీని తప్ప అయన సోదరులను కుటుంబ సభ్యులను అందరినీ వైసీపీ లాగేసుకుంది. ఇది సహజంగానే ఢిల్లీ పెద్దలకు కన్నెర్రకు అవకాశమిచ్చేదే.

ఢిల్లీ పెద్దల కోపానికి ప్రతిఫలమే ఈ విందు అనంతరం జరగబోయే పరిణామాలు అని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి పార్టీని వీడే అనుమానమున్న ఎంపీలతో మాట్లాడి సమస్యలేంటి? పరిష్కారమేంటి? సీఎంతో మాట్లాడతానని సయోధ్య షురూ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ విందు ప్రకంపనలు తెస్తుందా? లేక తృప్తిగా తినేసి పుకార్లకే పరిమితమవుతారా? అన్నది చూడాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle