newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

03-07-202003-07-2020 19:18:15 IST
Updated On 04-07-2020 10:30:37 ISTUpdated On 04-07-20202020-07-03T13:48:15.742Z03-07-2020 2020-07-03T13:47:44.103Z - 2020-07-04T05:00:37.130Z - 04-07-2020

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో సంచలనం కలిగించిన ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జైలులో వున్నారు. అనారోగ్యం కారణంగా అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆయన అరెస్ట్‌ కాకముందు ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అచ్చన్నకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది.

ఈఎస్‌ఐ కొనుగోళ్ల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించింది. రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. కానీ బుధవారం సాయంత్రం హడావుడిగా జీజీహెచ్‌ అధికారులు డిశ్చార్జి చేసి వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి.. అంబులెన్సులో ఎక్కించి విజయవాడ సబ్‌జైలుకు తీసుకెళ్లారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు అచ్చెన్నాయుడు అనారోగ్యం నేపథ్యంలో తిరిగి ఆస్పత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై శనివారం తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అచ్చెన్నాయుడుకు రెండోసారి శస్త్రచికిత్స జరిగిందని, చికిత్స తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిందని అచ్చెన్న.. లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని లాయర్ పేర్కొన్నారు. అయితే ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని ప్రభుత్వ లాయర్ వాదించారు. ఈ విషయంలో కోర్టు శనివారం ఏం తీర్పునిస్తుందో చూడాలి.

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   4 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   7 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   8 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   20 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   20 hours ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   04-12-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle