newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

ఇoకా ఢిల్లీ చేరని పోలవరం రీటెండర్ల రిపోర్ట్..!

14-10-201914-10-2019 12:43:22 IST
Updated On 14-10-2019 15:19:37 ISTUpdated On 14-10-20192019-10-14T07:13:22.163Z14-10-2019 2019-10-14T07:13:10.597Z - 2019-10-14T09:49:37.417Z - 14-10-2019

ఇoకా ఢిల్లీ చేరని పోలవరం రీటెండర్ల రిపోర్ట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేసి కొత్తవారికి అప్పగిస్తే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని.. పైగా ఆర్ధిక భారం కూడా పెరుగుతుందని ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి నివేదికలిచ్చింది. కేంద్రం కూడా రివర్స్ టెండర్ల ఆలోచనపై మరోసారి ఆలోచించుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సూచించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా పాత టెండర్లను రద్దు చేసి పారేసి రివర్స్ టెండరింగ్ కి తెరతీసింది. పాత కాంట్రాక్టర్ నవయుగ టెండర్ల రద్దుపై కోర్టుకెక్కింది. కోర్టు తీర్పు ఈ వ్యవహారంలో కీలకంగా మారింది.

అయితే మరోపక్క సర్కార్ మాత్రం రివర్స్ టెండరింగ్ మొదలుపెట్టేసింది. ఓ కంపెనీతో  మూడుసార్లు టెండర్లు వేయించి దానినే రివర్స్ టెండరింగ్ అంటరాని.. ఈ వ్యవస్థతో ఏకంగా 800 కోట్లు మిగిల్చామని ప్రకటించింది. అదేమాట ఢిల్లీవెళ్లి ప్రధాని నరేంద్రమోదీకి కూడా సీఎం చెప్పి వచ్చారు. అయితే రివర్స్ టెండర్ల ప్రక్రియ రిపోర్ట్ మాత్రం ఇంత వరకూ కేంద్రానికి చేరలేదట. ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్‌నే స్పష్టం చేశారు.

తాజాగా ఏపీ బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి నిర్మాణ, ఆర్ధిక పరిస్థితులను అంచనావేసి కేంద్రానికి నివేదిక అందించారు. ఆ సమయంలోనే కేంద్రమంత్రి షెకావత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అసలు పోలవరంలో ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదని, రివర్స్ టెండర్లు జరిగాయో లేదో కూడా తమకు తెలియదని, ఆ టెండర్లపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పేజీ కూడా రిపోర్ట్ పంపలేదని చెప్పారట.

నిజానికి పోలవరం పూర్తిస్థాయి కేంద్ర నిధులలో నిర్మాణం చేస్తున్న ప్రాజెక్ట్. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు త్వరగా పూర్తిచేయాలని నిర్మాణ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఆ బాధ్యతను తామే నిర్వర్తిస్తామని ప్రకటించింది. అయితే పాత కాంట్రాక్టర్లను మార్చేసి కొత్త వాళ్ళకి అప్పగించింది. దానికి రివర్స్ టెండర్ అనే ప్రక్రియను తీసుకొచ్చింది. అయితే కేంద్రానికి ఇప్పటి వరకు నోటి మాటలే తప్ప అధికారికంగా ఒక్క నివేదిక కూడా పంపకపోవడం ఆశ్చర్యం.

ఇందులో రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. రివర్స్ టెండరింగ్ వ్యవహారం కోర్టుకి చేరిన సంగతి తెలిసిందే. కనుక నిర్ణయం వచ్చేవరకు నిర్మాణం మొదలయ్యే పరిస్థితి లేదు. కోర్టు నిర్ణయం తర్వాతే కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు.

కానీ విద్యుత్ ప్రాజెక్టుకు కలగలపి టెండరింగ్ ఇవ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయి. అందుకే రిపోర్ట్ కేంద్రానికి పంపడం లేదు. కానీ కేంద్రానికి నివేదిక ఇవ్వకుండా.. కేంద్రం ఆమోదం తెలపకుండా కొత్త కాంట్రాక్టర్ మేఘా తట్ట మట్టి తీయలేదు.. గంప కాంక్రీట్ వేయలేదు. మరి కోర్టు తీర్పు వచ్చేది ఎప్పుడు? రాష్ట్రం కేంద్రానికి నివేదిక పంపించేది ఎప్పుడు? పోలవరం మొదలయ్యేది ఎప్పుడు? పూర్తయ్యేది ఎప్పుడు?!

 

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle