newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

ఇసుక రగడపై జగన్‌కు ముద్రగడ లేఖాస్త్రం

05-11-201905-11-2019 09:54:35 IST
Updated On 05-11-2019 16:02:28 ISTUpdated On 05-11-20192019-11-05T04:24:35.549Z05-11-2019 2019-11-05T04:24:15.980Z - 2019-11-05T10:32:28.804Z - 05-11-2019

ఇసుక రగడపై జగన్‌కు ముద్రగడ లేఖాస్త్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ లేఖ రాశారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఇసుక కొరతపై ఆందోళనలు చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం ఇసుక సమస్యను లైట్ తీసుకుంటున్నారని విపక్షాలు అంటున్నాయి.

‘‘ఇసుక అన్నది తాత్కాలిక సమస్య...90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోంది...265కిపైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలో ఉన్నాయి. అక్కడినుంచి ఇసుక తీయడం కష్టంగా ఉంది, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి’’ అంటున్నారు సీఎం. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాయడం మరింత వేడిని రగిలిస్తోంది. ఇసుక ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరం.. దానికి ప్రభుత్వం అడ్డం పడరాదు. ఇసుక అందించలేనపుడు రాష్ట్రం దాటకుండా నిఘా పెట్టి రాష్ట్రం లోపల ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ ఇసుకను ఉచితంగా తీసుకునేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ప్రజలు సుఖంగా బతికేలా పాలన ఉండాలన్నారు. ఇసుక కొరత లాంటి కారణాలు ప్రజల ఆత్మహత్యలకు దారితీయడం దారుణం అన్నారు. సమాజంలో మేధావి నుండి సామాన్యుడి వరకూ ఇసుక పాలసీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని అయినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.

తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భూములు అమ్మబోతున్నారన్న వార్తలు వింటున్నాం. ఎన్నికల సమయంలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా పెట్టాలని చూస్తున్నారు. 

వాటి అమలుకు తేదీలు ప్రకటిస్తున్నారు. కానీ అందులో మా కాపుల రిజర్యేషన్ అంశం లేకపోవడం మా కాపులు చేసుకున్న పాపంగా భావిస్తున్నాం. మీరు పరిపాలన చేస్తున్న తీరు మీరు తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోంది అని జగన్‌కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

కాపు ఉద్యమనేత లేఖ ప్రభుత్వం దృష్టికి వెళుతుందా? అసలే ఇసుక తుపానులో పడి మంత్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు చుట్టుముడుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle