newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఇసుక పాలసీ పారదర్శకం.. సర్కార్ సెల్ఫ్ డబ్బా..!

24-10-201924-10-2019 12:45:28 IST
Updated On 24-10-2019 14:37:06 ISTUpdated On 24-10-20192019-10-24T07:15:28.639Z24-10-2019 2019-10-24T07:15:18.349Z - 2019-10-24T09:07:06.793Z - 24-10-2019

ఇసుక పాలసీ పారదర్శకం.. సర్కార్ సెల్ఫ్ డబ్బా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తుఫాన్ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చీ రాగానే అప్పటి వరకు ఉన్న ఇసుక పాలసీని రద్దు చేసి పారేశారు. కానీ నూతన ఇసుక పాలసీని తీసుకురావడంలో జాప్యం చేయడంతో లెక్కకు మించిన నష్టం జరిగిపోయింది. ఇసుక పాలసీ రద్దు సమయంలో చెలరేగిన ఇసుక బ్లాక్ మార్కెట్ దందా ఇప్పటికీ కొనసాగుతూ రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని సర్వనాశనం చేసేసింది. దీనికి తోడు వర్షాభావం కూడా తోడవడంతో ఇసుక కొరత వేలాదిమంది కార్మికులను రోడ్డు పాలు చేసేసింది.

ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం నిర్మాణ రంగంలోని అడ్డా కూలీలు, కార్మికుల దగ్గర నుండి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగం, సిమెంట్, ఐరెన్ వ్యాపారం, నిర్మాణ రంగంలో వినియోగించే పనిముట్ల చిన్న తరహా పరిశ్రమలు, రవాణా వ్యవస్థ అన్నీ ఇబ్బందులలో పడ్డాయి. పరిశ్రమలు, వ్యాపారుల సంగతెలా ఉన్నా కూలీలా బాధలు వర్ణనాతీతం. నెలలో కనీసం 25 రోజులు పనికెళ్తే కానీ రోజూ మూడు పూట్ల ముద్దతో కడుపునిండని పేద కూలీలు వేలమందిలో ఉండగా వారందరికీ నాలుగు నెలలుగా పస్తులే మిగిలాయి.

అవకాశం ఉన్న కొందరు కూలీలు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలసెల్లిపోగా కొందరు రంగాన్ని వదిలి చేతనైన పనిచేసుకుంటూ బ్రతుకీడుస్తున్నారు. ఇది ప్రభుత్వం అవునన్నా కాదన్నా రాష్ట్రంలో కంటికి కనిపిస్తున్న నిజం. ఇంత దిగజారుడు స్థితికి చేరుతుందని పాత పాలసీని రద్దు చేసే రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోని ఉండరేమో. కారణాలేమైనా జరగాల్సింది జరిగిపోయింది.

రాష్ట్ర నిర్మాణ రంగంలో ఉన్న అధోగతి పరిస్థితుల నుండి గట్టెంకించి.. ప్రజల కష్టాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యత. కానీ చక్కదిద్దాల్సిన ప్రభుత్వం మాత్రం గుర్తించినట్లుగా నటించడమే ప్రజల నుండి ఆగ్రహంగా మారుతుంది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వాల మీదకు నెపం నెట్టేయడం హాస్యాస్పదంగా కూడా మారుతుంది. ఇక కొందరు మంత్రులైతే ఇసుకన్నది కొరతే లేదని, ఆ రంగంలో కూలీలకు పని దొరకడం లేదన్నది సమస్యేకాదని కించపరిచే విధంగా మాట్లాడడం మరీ దారుణమైన విషయం.

తాజాగా ఈ సమస్యపై మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తమ వలన కూలీలకు కొత్తగా కష్టాలు రాలేదని, ఈ సీజన్‌లో ఎప్పుడూ పని ఉండదని, ఇప్పుడు ఇదేమీ కొత్త కాదన్నారు. అసలు ఈ సమయంలో పనిలేకపోవడమనేది సమస్యే కాదని, ఇసుక సమస్య వల్లే కూలీలకు పనిదొరకడంలేదన్న వాదన కూడా కరెక్ట్ కాదన్నారు. ఇక ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు కూలీలకు సాయం చేసే ఉద్దేశ్యం అసలే లేదన్నారు.

ప్రభుత్వం పరిస్థితిని ముందే అంచనా వేయలేకపోవడం.. అసమర్ధత వలనకానీ ఇసుక విధానంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ఇది ఏ ఒక్క వర్గమో చెప్తున్న మాట కాదు. అన్ని వర్గాలలో నెలకొన్న అభిప్రాయం అదే. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం మాత్రం గుర్తించేందుకు కూడా ఇష్టపడం లేదు. పైగా తమ ప్రభుత్వంలో ఇసుక విధానం పారదర్శకంగా అమలు చేస్తున్నామని సెల్ఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటున్నారు. కాస్త కళ్ళు తెరిచి చూడండి సర్ అంటూ ప్రజలు వేడుకుంటున్నారు.

 

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle