newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఇసుక దీక్షలో టీడీపీ ...కొరత లేదంటున్న జగన్

30-10-201930-10-2019 12:53:20 IST
Updated On 30-10-2019 15:34:14 ISTUpdated On 30-10-20192019-10-30T07:23:20.567Z30-10-2019 2019-10-30T07:23:18.776Z - 2019-10-30T10:04:14.700Z - 30-10-2019

ఇసుక దీక్షలో టీడీపీ ...కొరత లేదంటున్న జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులను, యజమానులను తీవ్రంగా వేధిస్తోంది. అసలు రాష్ట్రంలో ఇసుక కొరత లేదని ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.  రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు రావడం వల్లే ఇసుక రీచ్ లు తెరవలేకపోయామని, వర్షాలు తగ్గిన వెంటనే ఇసుక కొరత తీరుతుందని సీఎం వైఎస్ జగన్  వివరణ ఇస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ మాత్రం ఇసుక కొరతపై నిరసనను తీవ్రతరం చేసింది. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని, కూలీలు రోడ్డున పడ్డారని పనులు లేక అవస్థలు పడుతున్నారని టీడీపీ ధర్నాలు చేస్తోంది. ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ గుంటూరులో దీక్షకు దిగింది.

మాజీ మంత్రి నారా లోకేష్ గుంటూరులో ఇసుక దీక్షలో కూర్చున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట లోకేష్ దీక్ష చేస్తున్నారు.  లోకేష్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున కదలి వచ్చాయి. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

మరోవైపు వైసీపీ నిర్వహిస్తున్న ఇసుక వారోత్సవాలపై మండిపడ్డారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. పక్కనున్న తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయని, కానీ అక్కడ ఇసుక కొరత లేనప్పుడు ఏపీలో ఇసుక కొరత ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఇసుక వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు.

ఆరుగురి ఆత్మహత్యలకు కారణం ఇసుక కొరతేనని, వైసీపీ నేతలు ఇసుకాసురులుగా మారారన్నారు. గుంటూరు దీక్షలో ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే లు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ లు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీడీపీ ఇసుక దీక్షలో ఇసుక హమాలీలు, బెల్దారు మైస్త్రీ లు, ముఠా కార్మికులు, రోజువారీ కూలీలు, ఇసుక సంబంధిత కూలీలు,కార్మికులు పాల్గొన్నారు.

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   8 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   8 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   9 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   10 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   11 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   15 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   15 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   16 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   16 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle