newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇసుక కొరతలేదంటూ జగన్ పబ్లిసిటీ..

19-11-201919-11-2019 10:55:58 IST
2019-11-19T05:25:58.818Z19-11-2019 2019-11-19T05:25:55.722Z - - 15-12-2019

ఇసుక కొరతలేదంటూ జగన్ పబ్లిసిటీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక ముఖ్యమైన సందర్భంలోనో లేక ఒక కీలక పథకం లేక ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగానో ప్రధాన దినపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలను విడుదల చేయడం ఏ ప్రభుత్వానికైనా పోరపాటే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసాధారణమైన చర్యకు పాల్పడింది. రాష్ట్రంలో ఇకనుంచి సులువుగా ఇసుక దొరుకుతుందని ప్రజలకు సమాచారమిస్తూ సోమవారం అన్ని ప్రధాన దినపత్రికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి ప్రంట్ పేజీ ప్రకటనను విడుదల చేసింది. ఏపీలోని 175 ఇసుక స్టాక్ పాయింట్లను ఒక్కోపాయింట్‌లో ఇసుక ధరలతో సహా ఆ ప్రకటన నమోదు చేసింది. 

ఆ ప్రకటన తెలిపిన దాని ప్రకారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి ఒక్కో ఇసుక స్టాక్ పాయింట్‌లో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, కనిష్టంగా టన్నుకు 410 రూపాయల నుంచి రూ. 1,590ల వరకు ధర ఉన్నట్లు ఈ ప్రకటన తెలిపింది. 

పైగా రాష్ట్రంలో ఇసుకు మాఫియాను పూర్తిగా నిర్మూలించటడానికి వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నట్లు ఫుల్ పేజీ ప్రకటన తెలిపింది. ఎవరైనా ఇసుక విషయంలో అవినీతికి పాల్పడినా, లేక నిర్దేశించిన దానికంటే ఎక్కువ ధరకు ఎవరైనా ఇసుక అమ్మడానికి ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 14500కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రకటన పేర్కొంది. 

ఇకనుంచి ప్రతిరోజూ 2 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తామని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. టీడీపీ హయాంలో ఇసుక సరఫరాలో అవినీతి మేటలు వేసిందని చెబుతూ ఇసుక టెండర్లను ఉన్నపళంగా రద్దు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణా గోదావరి వరదలు వచ్చి ఇసుక తవ్వకానికి వీల్లేకపోవడంతో గత నాలుగు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయి లక్షలాది కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

Image result for Andhra sand crisis Government assures availability of sand through newspaper ads

పనులు దొరక్క 50మంది నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని ప్రతిపక్షం ఆరోపిస్తూ నిరసనదీక్షలకు పూనుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక రోజు నిరసన దీక్షతో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కార్యక్రమంతో ఇసుక కొరతపై నిరసనలను రక్తి కట్టించారు. 

ప్రతిపక్షం మూకుమ్మడిగా ఇసుక కొరతపై చేస్తున్న ఆరోపణలను వైకాపా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వరుస వరదల కారణంగానే ఇసుక తవ్వకం పనులు ఆగిపోయాయని సమర్థించుకుంటూ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఇసుకను తగినంత పరిమాణంలో అందుబాటులోకి తెచ్చేందుకు అనేక చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్పింది.

ఇప్పుడు రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వచ్చిందన్న ధీమాతోనే జగన్ ప్రభుత్వం భారీ ప్రకటనతో సహా ప్రతిపక్షానికి సవాల్ విసిరింది. 

సెప్టెంబర్ 5న కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం రెండు నెలల తర్వాతే ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాగలిగింది. అయితే ఈ రెండునెలల కొరతల సంక్షోభం 30 లక్షల మంది నిర్మాణ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం కలిగించింది. ప్రతిపక్షాల తీవ్ర విమర్శలను ఇన్నాళ్లుగా ఎదుర్కొంటూ వచ్చిన వైకాపా  ప్రభుత్వం ఎట్టకేలకు ప్రతిపక్షాలను సవాలు చేస్తూ పుల్ పేజీ యాడ్‌తో ఇసుక సమృద్ధిగా ఉందంటూ ప్రకటన చేయడం విశేషం. ఇకమీదైనా ఇసుకను సరిగా అందరికీ అందుబాటులో ఉంచుతూ సరఫరా చేస్తే అదే పదివేలు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle