newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఇసుక కొరతపై టీడీపీ పోరాటం.. లోకేష్ హాట్ కామెంట్స్

25-10-201925-10-2019 13:15:30 IST
Updated On 25-10-2019 18:20:13 ISTUpdated On 25-10-20192019-10-25T07:45:30.341Z25-10-2019 2019-10-25T07:45:26.697Z - 2019-10-25T12:50:13.862Z - 25-10-2019

 ఇసుక కొరతపై టీడీపీ పోరాటం.. లోకేష్ హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షానికి ప్రధాన ప్రచార అస్త్రం ఇసుకే. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత నిర్మాణరంగాన్ని కుదలేయ్యేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ ఇసుకను తెరమీదకు తెస్తోంది. తాజాగా శుక్రవారం ఇసుక కొరతను హైలైట్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తందా భవన నిర్మాణ రంగ కార్మికులకు మద్దతుగా నిరసనలు చేపట్టింది. 

Image

ఐదు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లిన అసమర్థ సీఎం వైఎస్ జగన్ అంటూ మాజీ మంత్రి లోకేష్ విమర్శలు చేశారు. జె-ట్యాక్స్ తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ హయాంలో రూ.10 వేలు ఉన్న లారీ ఇసుకను ఇప్పుడు వైకాపా ఇసుకాసురులు 40 వేల నుండి లక్ష రూపాయిలకు అమ్ముకుంటూ ప్రజలను లూటీ చేస్తున్నారు.

నిర్మాణరంగం పడకేసి, కార్మికులు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు లోకేష్. 5 నెలల నుండి పని లేకుండా చేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన వైకాపా ప్రభుత్వం, ఒక్కో కార్మికుడికి  నెలకి రూ.10 వేలు చొప్పున 50 వేల భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

https://www.photojoiner.net/image/839nqqpr

ఇసుక కొరత కారణంగా కూలీలు ఉపాధి కోల్పోవడంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. జగన్ పాలనలో సామాన్యులకు ఇసుక దొరకడం గగనంగా మారిందన్నారు లోకేష్. ఇసుక కొరత వల్ల ఉపాధి దొరక్క అప్పుల ఊబిలోకి కూలీలు వెళ్ళిపోతున్నారని, వైసీపీ నేతలు, మంత్రులు మాత్రం ఇసుక కొరతే లేదని చెప్పడం దారుణం అన్నారు లోకేష్. 

Image


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle