newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఇసుక కొరతపై ఇంత అభాండాలా.. జగన్ ఖండన

30-10-201930-10-2019 12:31:32 IST
Updated On 30-10-2019 15:38:06 ISTUpdated On 30-10-20192019-10-30T07:01:32.601Z30-10-2019 2019-10-30T07:01:30.114Z - 2019-10-30T10:08:06.007Z - 30-10-2019

ఇసుక కొరతపై ఇంత అభాండాలా.. జగన్ ఖండన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సంక్షోభంపై మీడియాలో క్రమంతప్పకుండా వస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు, ఇసుక కొరతపై ప్రతిపక్షం చేస్తున్న నిరసన కార్యక్రమాలు, ఉపాధి కోల్పోయిన కారణంగా కొందరు నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వస్తున్నవార్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తీవ్రంగా కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇసుక సంక్షోభం గురించి ప్రజలకు సరైన చిత్రణ ఇవ్వడంలో విఫలమైనందుకు మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో వైస్ జగన్ ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్ సీపీ నేతల పట్ల తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. అనేక కారణాలతో ఇసుక కొరత ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మీడియా, ప్రతిపక్షాలు స్వర్గం పైనుంచి కిందపడిన చందాన ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు, వరదలు కారణంగా ఇసుక అవసరమైనంత మేరకు లబ్యం కావడం లేదన్న వాస్తవాన్ని ప్రజలకు తెలుపలేకపోయినందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులను తప్పుపట్టారు. త్వరలో ఇసుక లభ్యత మెరుగవుతుందని ప్రజలకు వివరించడంలో పార్టీ నేతలు కూడా విఫలమయ్యారని జగన్ విమర్శించారు. 

ఇసుక సరఫరా విషయంలో గత ప్రభుత్వం కొనసాగించిన భారీ అవినీతికి తన ప్రభుత్వం అడ్డుకట్టలేసిందని ప్రజలకు వివరించడంలో పార్టీ నేతలు విఫలం చెందారని జగన్ ఆక్షేపించారు. ఇసుక తవ్వకాల్లో అవినీతిని పూర్తిగా అరికట్టినందుకు మనం నిజంగా గర్వపడాలని జగన్ అభిప్రాయపడ్డారు.

ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందున ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చేవారం పొడవునా ఇసుక సమస్యపై అధికారులు కృషిచేసి ఇసుక కొరతను లేకుండా చేయాలని సీఎం పిలుపిచ్చారు. ఇసుక కొరతపై చేస్తున్న తప్పుడు ప్రకటనలను అధికారులు ఖండించాలని అధికారులను ఆదేశించారు.

ఇసుక విషయంలో గతంలో ఏం జరుగిందో, ఇప్పుడేం జరుగుతోందో ప్రజలకు వివరించాలి. మన వైపు నుంచి ఏ తప్పూ జరగపోయినా ప్రభుత్వం నుంచి ఘోరతప్పిదాలు జరిగిపోతన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించాలని సీఎం సూచించారు. త్వరలోనే ఇసుకను సమద్ధిగా సరఫరా చేయడం ద్వారా నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

స్థానిక వనరులనుంచి ఇకపై ఎవరైనా ఇసుకను తీసుకోవచ్చని, గ్రామ సచివాలయానికి సమాచారం తెలిపి 20 కిలోమీటర్ల పరిధిలో ట్రాక్టరు ద్వారా ఇసుకను తరలించవచ్చని, పని అవసరమైనవారు గ్రామ సచివాలయం గుండా ఇసుక రీచ్‌లలో పని చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.

కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇసుక కొరత విషయంలో ప్రభుత్వ ఇప్పటికే తీవ్ర అప్రతిష్ట పాలైన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ అవినీతిపై సాకు చూపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇసుక విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా లక్షలాది మంది ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ తీసుకొచ్చిందిని వైకాపా నేతలే అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్‌ల ఏర్పాటు, ఇసుక వారోత్సవాలు ప్రభుత్వ అప్రతిష్టను ఏమేరకు తొలగించగలవన్నది వేచి చూడాల్సిందే మరి.

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   7 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   7 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   9 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   10 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   14 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   14 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   15 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle