newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఇసుక ఆత్మహత్యల్ని లైట్ తీసుకున్న విజయసాయి

30-10-201930-10-2019 16:07:46 IST
2019-10-30T10:37:46.851Z30-10-2019 2019-10-30T10:37:44.850Z - - 13-08-2020

ఇసుక ఆత్మహత్యల్ని లైట్ తీసుకున్న విజయసాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. శ్రీకాకుళం నుండి కృష్ణాజిల్లా వరకు రాష్ట్రంలో అత్యంత దారుణమైన సమస్య ఏదైనా వేధిస్తుంది అంటే వాటిలో ఇసుక మొదటిది. వైసీపీ సర్కార్ తెచ్చిన పారదర్శక విధానంలో ఆ పార్టీ నేతలకు తప్ప సామాన్య ప్రజలకు ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుక ఆన్ లైన్ లో ఉంచిన రెండు నిమిషాలకే నో స్టాక్ బోర్డు కనిపిస్తుందని స్వయానా ఆ పార్టీ ఎమ్మెల్యేనే విమర్శలకు దిగాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇక నిన్నటి వరకు కూడా పరిస్థితిని గుర్తించనట్లుగా నటించిన ప్రభుత్వం చివరికి ఇసుక తుఫాన్ మంత్రులను చుట్టముట్టడంతో సాక్షాత్తు సీఎంలోనే చలనం మొదలైంది. తాజాగా ఇసుక సమస్యపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎం ఇసుక సమస్యపై ప్రతిపక్షాలు రాబంధుల మాదిరి పీక్కుతింటున్నాయని వారం రోజుల్లో ఇసుక సమస్యలను పరిష్కరించాలని.. ఇందుకోసం ఇసుక వార్షికోత్సవం మొదలు పెట్టాలని కూడా సూచించారు.

ముందుగా ఇసుక సమస్యను సీఎం గుర్తించడం ఊరట కలిగించేదే అయినా సమస్యను ఎంతవరకు తీర్చగలరు అన్నది ప్రభుత్వం.. సీఎం సామర్ధ్యం మీదే ఆధారపడి ఉంటుంది. కాగా గత మూడు నెలలుగా ఉపాధి లేక చేసిన అప్పుల భారం పెరిగి పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ పోషణ భారమైన కొందరు కూలీలు ఆత్మహత్యలను ఆశ్రయించారు. ఈ బలవన్మరణాలే ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో ప్రభుత్వం సమస్య మీద ఫోకస్ పెంచింది.

అయితే వైసీపీ ముఖ్యనేత, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న విజయసాయి రెడ్డి ఆ  ఆత్మహత్యలు అంత పెద్దవేం కాదంటూ వ్యాఖ్యానించడం ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తుంది. కూలీల ఆత్మహత్యలు.. ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన విజయసాయి.. 'గుంటనక్కలు, రాబంధులు శవాల వేటకు బయల్దేరాయి.. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం.. ఇబ్బందులలో ఉన్నవారిని మరింత రెచ్చగొట్టడమే రాబంధులకు తెలిసిన విద్య. పీక్కు తినడమే వచ్చు.. ప్రాణం పోయడం ఎలాగూ తెలియదు' అని ట్వీట్ చేశారు.

ఇందులో ప్రతిపక్షాలను రాబంధులతో పోల్చడం అయన స్థాయికి తగదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఢిల్లీలో పెద్దగా ఉన్న నేత ప్రతిపక్షాలను శవాలను పీక్కుతినే రాబంధులుగా పోల్చడం అయన విజ్ఞతకే వదిలేయాలి. కానీ ఇసుక కొరతతో కార్మికులు వంద రోజులు పైగా పస్తులు ఉంటూ ఇక ఆశలు కూడా లేకపోవడంతో తీసుకున్న ప్రాణాలను చిన్న సమస్యగా పోల్చడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది.

విజయసాయి ట్వీట్ పై స్పందించిన కొందరు సమస్యను తీర్చాల్సిన ప్రభుత్వం కార్మికులు చస్తున్నా ఇంకా చిన్న సమస్యగా పేర్కొనడం సిగ్గుచేటుగా పేర్కొనగా అసలు వైసీపీ పార్టీ పుట్టిందే ఓదార్పు యాత్ర నుండేనని.. మరి రాష్ట్రంలో ఎక్కడ చావు వార్త విన్నా మీ నాయకుడు వెళ్లి ఓదార్చి రాజకీయం చేశారని.. మరి గుంటనక్కలు ఎవరో.. శవాలను పీక్కుతిన్న రాబంధులు ఎవరో విజయసాయి రెడ్డి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఘాటు సమాధానాలిచ్చారు. అయినా ఏమాట కామాట.. విజయసాయి లాంటి పెద్దలకు.. గుంటనక్కలు.. రాబంధులు అనే పదజాలం సమంజసం కాదు సుమీ!

 

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   8 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   9 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   9 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   11 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   11 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   15 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   16 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   16 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   16 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle