newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ఇసుకపై నిరాధార ఆరోపణలెందుకు బాబూ.. పెద్దిరెడ్డి ధ్వజం

13-11-201913-11-2019 13:09:39 IST
2019-11-13T07:39:39.807Z13-11-2019 2019-11-13T07:39:32.700Z - - 09-12-2019

ఇసుకపై నిరాధార ఆరోపణలెందుకు బాబూ.. పెద్దిరెడ్డి ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్ది నెలలుగా రాష్ట్రాన్ని పట్టిపీడీస్తున్న ఇసుక భూతం ప్రజలనేమో కానీ ప్రభుత్వాన్ని మాత్రం వదలడం లేదనిపిస్తోంది. ఇసుక కొరత వ్యవహారంపై రోజు ప్రతిపక్షాలు దాడి చేయడం, ప్రభుత్వం దాన్నికాచుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు సులువుగా చేరవేయడంలో విఫలమవుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వానికి వకాల్తా పుచ్చుకుని ఇసుక కొరతపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి ప్రయత్నించారు.

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ బాబు, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లు వైకాపా ప్రభుత్వంపై ఇసుక విధానంపై నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. వర్షాకాలంలోనే ఇసుకను తవ్వి తీయడం కష్టమని, పైగా గోదావరి, కృష్ణా నదుల్లో గత కొన్ని నెలలుగా వరదలు పోటెత్తుతున్నందున రాష్టంలో అనివార్యంగా ఇసుక కొరత ఏర్పడిన మాట జగమెరిగిన సత్యమేనని మంత్రి చెప్పారు. పైగా గోదావరిలో ఇప్పటికీ వరద నీరు పారుతోందని ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక ఎలాతవ్వి తీయాలో ప్రతిపక్షాలు సలహా ఇస్తే బాగుంటుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలను నిర్వహించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేస్తోందని, రాష్ట్రంలో ఇసుక లభ్యతను మెరుగుపర్చడానికి ప్రభుత్వ కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని, అధికారులను ఏమరుపాటుగా ఉండరాదని హెచ్చరిస్తున్నారని మంత్రి తెలిపారు.

ఇసుక అమ్మకానికి కొత్త స్టాక్ పాయింట్లను గుర్తించాల్సిందిగా కలెక్టర్లను కోరామని, ఇప్పటికే స్టాక్ పాయింట్లను 180కి పెంచామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం 80,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని రోజుకు 1.2 లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యతను పెంచుతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితిని మెరుగుపర్చడానికి కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించడానికి రాష్ట్ర  ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌కు పురమాయించిందని స్వల్పకాలంలోని ఇసుక కొరత సమస్య లేకుండా చేస్తామని మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వం అననుకూల పరిస్థితుల్లోనూ ఇసుక కొరతను తీర్చడంలో తలమునకలై ఉంటూండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నవంబర్ 14న ఇసుక కొరతపై ధర్నా చేయాలని సంకల్పించడం వింతగా  ఉందని మంత్రి ఎగతాళిచేశారు. ఆగస్టు నెలనుంచి నిరవధికంగా కురుస్తున్న వర్షాలు, వరదలు కారణంగా ఇసుక తవ్వితీయడం కుదరలేదని తెలుస్తున్నప్పటికీ తప్పుడు ఆరోపణలతోనే బతుకు వెళ్లదీయాలని చంద్రబాబు భావిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ముఖ్యమైన పాయంట్లవద్ద వీడియో కెమెరాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 200 చెక్ పోస్టులను పెట్టి తనిఖీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇసుక కొరతకు కారణాలు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ టీడీపీ, యాక్టర్ కమ్ పొలిటీషియన్ పవన్ కల్యాణ్ ఇరువురూ వైకాపాపై ఆడిపోసుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle