newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

ఇసుకపై కామ్రేడ్స్ పోరాటం..జగన్ పై వత్తిడి

04-11-201904-11-2019 08:59:53 IST
2019-11-04T03:29:53.730Z04-11-2019 2019-11-04T03:29:18.935Z - - 14-11-2019

ఇసుకపై కామ్రేడ్స్ పోరాటం..జగన్ పై వత్తిడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇసుక అధికార పార్టీకి కంట్లో నలుసుగా మారింది. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీలు ఇసుక పై పోరాటం చేస్తున్నాయి. ఆదివారం పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇసుక కొరత తీరిస్తే తాను ఉద్యమం ఎందుకు చేస్తానని, సినిమాలు చేసుకుంటానన్నారు. 

మరోవైపు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు దూరంగా ఉన్న సీపీఐ తాజాగా ఈ సమస్యపై సీఎం జగన్ కి లేఖ రాసింది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రంలో ఇసుక సత్యాగ్రహం తప్పదంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. 

గత 5 నెలలుగా ఇసుక సమస్య ఉందని, రాష్ట్రంలో వర్షాలు, నదులలో నీరు వల్ల ఇసుక కొరత ఉందని మంత్రులు చెప్పడం దారుణంగా ఉందని ఎద్దేవా చేశారు. వర్షాలు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే లేవని తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో వర్షాలు, వరదలు సంభవించలేదా? అని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఇతర రాష్ట్రాలలో కనిపించని ఇసుక సమస్య  ఏపీకే ఎందుకొచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  

ఇసుక విషయంలో వాస్తవానికి, ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతనలేదన్నారు. మంత్రులు చెప్పేవన్నీ కేవలం సాకులు మాత్రమేనని, ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల వంటి వాహనాలకు నెలవారీ రుణ వాయిదాలు చెల్లించే పరిస్థితి లేక దిక్కులేని స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం జగన్ వెంటనే స్పందించి ఇసుక సమస్య పరిష్కరించాలన్నారు. 

కార్మికుల కుటుంబాలకు రు.20 వేలు భృతి క్రింద చెల్లించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రు.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, ట్రేడ్ యూనియన్లను, ప్రజాసంఘాలను సమైక్యపరచి సిపీఐ ఇసుక సత్యాగ్రహం చేయకతప్పదన్నారు రామకృష్ణ.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle