newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఇలా అయితే పార్టీ బ‌ల‌ప‌డిన‌ట్లే..!

07-07-201907-07-2019 09:10:55 IST
Updated On 08-07-2019 10:45:05 ISTUpdated On 08-07-20192019-07-07T03:40:55.822Z07-07-2019 2019-07-07T03:40:52.843Z - 2019-07-08T05:15:05.595Z - 08-07-2019

ఇలా అయితే పార్టీ బ‌ల‌ప‌డిన‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యూహం ఎవ‌రికీ అంతుచిక్క‌కుండా ఉంది. వ‌ల‌స‌ల‌నే న‌మ్ముకున్న ఆ పార్టీ తెలంగాణ‌లో కాంగ్రెస్ నుంచి, ఏపీలో టీడీపీ నుంచి నేత‌ల‌ను ఆక‌ర్షిస్తోంది.

నేత‌లు వ‌స్తే పార్టీ ఆటోమెటిగ్గా బ‌లోపేతం అవుతుంద‌నే ఆలోచ‌న‌లో బీజేపీ ఉంది. అయితే, రెండు రాష్ట్రాలపై కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు మాత్రం బీజేపీ ఎదుగుద‌ల‌కు క‌చ్చితంగా బ్రేక్ వేసేలా ఉన్నాయి.

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఎటువంటి ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. రెండు రాష్ట్రాలు ఆశిస్తున్న‌వేవీ కేంద్ర బ‌డ్జెట్‌లో లేవు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా ఊసు ఎలాగూ లేదు. రాజ‌ధానికి ప్ర‌త్యేకంగా నిధులు ఇవ్వ‌లేదు.

ఇత‌ర విభ‌జన హామీల అమ‌లు కోసం కూడా బ‌డ్జెట్‌లో ఎటువంటి ప్ర‌స్తావ‌న తేలేదు. అస‌లే లోటు బ‌డ్జెట్‌తో క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆదుకునే విధంగా అయితే బ‌డ్జెట్ లేదు.

దీంతో వైసీపీ కూడా కేంద్ర బ‌డ్జెట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసింద‌ని ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఇదే చెప్పింది. అయితే, ఇలా కేంద్ర బ‌డ్జెట్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద‌వి విర‌వ‌డం స‌హ‌జ‌మే. కానీ, రెండు రాష్ట్రాల్లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటున్న బీజేపీ ప్ర‌య‌త్నాల‌కు మాత్రం కేంద్ర బ‌డ్జెట్ కొంత ఆటంకం క‌లిగించేదే. 

ఇప్ప‌టికే ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. అందుకే ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఇత‌ర పార్టీల‌తో కాకుండా నోటాతో పోటీ ప‌డింది. ప్ర‌జ‌ల్లో ఆ పార్టీపై ఉన్న వ్య‌తిరేక‌త ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైంది. అయినా కూడా కేంద్రంలో అధికారం ఉంద‌నే కార‌ణంగా టీడీపీ నేత‌లు భ‌యంతోనో, భ‌క్తితోనో బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ స‌మ‌యంలో రాష్ట్రానికి న్యాయం చేస్తున్నామ‌ని బీజేపీ ఎక్క‌డా నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

తెలంగాణ‌లోనూ ఆ పార్టీ ప‌రిస్థితి ఇలానే ఉంది. ఇటీవ‌లి పార్ల‌మెంటు ఎన్నిక‌లు బీజేపీకి రాష్ట్రంపై ఆశ‌లు పెంచాయి. 19 శాతం ఓట్లు సాధించి నాలుగు ఎంపీ సీట్లు గెల‌వ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బ‌లంగా మారుతామ‌ని బీజేపీ భావిస్తోంది.

అయితే, బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఎటువంటి ప్రాధాన్య‌తా ఇవ్వ‌లేదు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరుతున్నా ఇవ్వలేదు. మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుకు 19 వేల కోట్లు ఇవ్వాల‌ని నీతి అయోగ్ సిఫార్సు చేసినా ఆ దిశ‌గా కేంద్రం ఆలోచ‌న చేయ‌లేదు.

దీంతో తెలంగాణ‌లోనూ బీజేపీ అన్యాయం చేస్తోంద‌ని భావ‌న ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇక‌, గెలిచిన న‌లుగురు ఎంపీల‌పైనా ఈ ప్ర‌భావం ఉంది. తాను గెలిచాక ఐదు రోజుల్లో నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు తీసుకువ‌స్తాన‌నే ప్ర‌ధాన హామీతో ధ‌ర్మ‌పురి అర్వింద్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గెలిచి నెల గ‌డిచినా ఆ ఊసు లేక‌పోవ‌డంతో ఆయ‌న విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle