newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఇలాగైనా రాయ‌ల్ వశిష్ఠ బ‌య‌ట‌కు వ‌స్తుందా..?

30-09-201930-09-2019 16:45:47 IST
Updated On 30-09-2019 18:00:21 ISTUpdated On 30-09-20192019-09-30T11:15:47.298Z30-09-2019 2019-09-30T11:15:33.047Z - 2019-09-30T12:30:21.290Z - 30-09-2019

ఇలాగైనా రాయ‌ల్ వశిష్ఠ బ‌య‌ట‌కు వ‌స్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గోదావ‌రి న‌దిలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం జ‌రిగి ,15 రోజుల‌వుతున్నా ప‌డ‌వ‌ను బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశం అత్యంత ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో ప‌డ‌వ‌ను వెలికి తీసేందుకు ప్ర‌భుత్వం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయించినా విఫ‌ల‌మ‌వుతున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మాదంలో చిక్కుకున్న 15 మంది ప‌ర్యాట‌కుల జాడ తెలియ‌డం లేదు. బోటును వెలికితీస్తే కానీ వారి జాడ తెలిసే అవ‌కాశం లేద‌ని అధికారులు భావిస్తున్నారు. 

దీంతో మ‌రోసారి ఇవాళ ప‌డ‌వ‌ను వెలికితీసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. దేవీప‌ట్నం మండ‌లం క‌చ్చులూరు మందం వ‌ద్ద ఈ నెల 15వ తేదీన రాయ‌ల్ విశిష్ఠ ప‌డ‌వ మునిగిపోయింది. ప‌డ‌వ‌లో 77 మంది ప‌ర్యాట‌కులు ఉండ‌గా 26 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మొత్తం 36 మంది మృత‌దేహాలు ఇప్పటికి ల‌భించాయి. 

మ‌రో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే, వీరంతా ప‌డ‌వ లోప‌ల ఉన్న గదుల్లో ఉండి ఉంటార‌ని, కాబ‌ట్టి ప‌డ‌వ‌ను బ‌య‌ట‌కు తీస్తే కానీ వారి ఆచూకీ తెలియ‌ద‌ని అధికారులు ఒక అంచ‌నాకు వ‌చ్చారు. త‌మ వారి ఆచూకీ కోసం కుటుంబ‌స‌భ్యులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొంద‌రైతే ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో ఆచూకీ లేకుండా పోయిన వారికి క‌ర్మ‌కాండ‌లు కూడి నిర్వ‌హించారు.

ప‌డ‌వ‌ను వెలికి తీయ‌డానికి ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌య‌త్నించినా విఫ‌ల‌మ‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో గోదావ‌రిలో మూడు సుడిగుండాలు ఉన్నాయి. దీంతో ప‌ర్యాట‌కులను గాలించ‌డానికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ప‌డ‌వ‌ను బ‌య‌ట‌కు తీసేందుకు అనుభ‌వం ఉన్న ప్రైవేటు సంస్థ‌ల‌ను అధికారులు సంప్ర‌దించారు.

ఈ నేప‌థ్యంలో కాకినాడ‌కు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ నిర్వ‌హ‌కుడు ధ‌ర్మాడి స‌త్యంకు ఈ ప‌ని అప్ప‌గించింది. 27 మంది స‌భ్యులున్న స‌త్యం బృందం ఇవాళ రంగంలోకి దిగుతోంది. రెండు రోజుల్లో ప‌డ‌వ‌ను తీస్తామ‌ని స‌త్యం బృందం న‌మ్మ‌కంగా ఉంది. వీరు బోటు ఉన్న ప్రాంతంలో నీటిలోకి లంగ‌ర్ల‌ను వ‌దులుతారు. బోటు లంగ‌ర్ల‌కు చిక్కాక భారీ ఇనుప తాళ్లు వేసి ఒడ్డున ఉండే భారీ ప్రొక్లెయిన‌ర్‌తో ప‌డ‌వ‌ను లాగుతారు.

అత్యంత క్లిష్ఠ‌మైన ఈ పనిలో భాగ‌మ‌వుతున్న సిబ్బందికి ప్ర‌మాద బీమా కూడా చేయించారు. ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. బ‌య‌టివారిని ఎవ‌రినీ ఈ ప్రాంతానికి వెళ్ల‌నివ్వ‌డం లేదు. ప‌డ‌వ వెలికి తీస్తే త‌మ వారి ఆచూకీ దొరుకుతుందేమో అని ధీన‌స్థితిలో కుటుంబ‌స‌భ్యులు ఎదురుచూస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle