newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

25-05-202025-05-2020 07:45:34 IST
Updated On 25-05-2020 08:54:47 ISTUpdated On 25-05-20202020-05-25T02:15:34.162Z25-05-2020 2020-05-25T02:15:32.363Z - 2020-05-25T03:24:47.727Z - 25-05-2020

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో వివాదంలో చిక్కుకుంది. నిజానికి వివాదాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొత్తేమీ కాదు. అయితే, ఈసారి సున్నిత‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విష‌యంలో ప్ర‌భుత్వం పూర్తిగా ఇరుక్కుపోయింది. టీటీడీ భూములను అమ్మాల‌ని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. ఈ విష‌యంలో టీటీడీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉన్నా అలా చేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్య‌మం మొద‌లైంది. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి. దేశ‌వ్యాప్తంగా ఈ అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌తం అనే అంశం రాజ‌కీయంగా ఎప్పుడూ ఇబ్బంది పెడుతోంది. క్రైస్త‌వులైన జ‌గ‌న్‌ను, అంత‌కుముదు ఆయ‌న తండ్రి వైఎస్సార్‌ను ప్ర‌త్య‌ర్థులు, కొన్ని శ‌క్తులు మ‌తాన్ని ముడిపెడుతూ టార్గెట్ చేస్తుంటాయి. అయితే, మొద‌ట వైఎస్సార్‌, త‌ర్వాత జ‌గ‌న్ సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌మ‌పై ఒక మ‌తం ముద్ర లేకుండా చూసుకోవ‌డం, అన్ని మ‌తాలూ త‌మ‌కు ఒక‌టే అనే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతో వైఎస్సార్ రెండుసార్లు, జ‌గ‌న్ ఒక‌సారి ముఖ్యమంత్రి అయ్యారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మొద‌టినుంచీ ఆయ‌న హిందూ మ‌తంపై క‌క్ష‌క‌ట్టార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున మొద‌లుపెట్టారు. టీటీడీ ఛైర్మ‌న్‌గా క్రైస్త‌వుడిని నియ‌మించార‌ని, కొండ‌పైన చ‌ర్చి క‌ట్టార‌నే ప్ర‌చారం దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రిపారు. అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లోనే ఈ ప్రచారం జ‌ర‌గ‌డం, జ‌గ‌న్ హిందూ వ్య‌తిరేకి అనే ముద్ర‌ను వేయాల‌ని చూడ‌టం జ‌రిగింది. కానీ, ఇవి రెండు అబ‌ద్ధాలే అని తేలాయి. టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి నికార్సైన హిందువు అని తేల‌గా తిరుమ‌ల కొండపైన నిర్మించింది చ‌ర్చి కాదు, అది ఒక అట‌వీ శాఖ కార్యాల‌యం అని తేలింది. నిజం గ‌డ‌ప దాటేముందే అబ‌ద్ధం ఊరంతా తిరిగి వ‌స్తుంద‌నే సామెత ప్ర‌కారం అప్ప‌టికే ఈ త‌ప్పుడు ప్ర‌చారాలు జ‌గ‌న్‌కు చాలా న‌ష్టం చేశాయి.

అయితే, అబ‌ద్ధాల‌నే అంత‌పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసి త‌న‌పై హిందు వ్య‌తిరేకి అనే ముద్ర వేశారు. అటువంటప్పుడు మ‌తానికి సంబంధించి, ఆల‌యాల‌కు సంబంధించిన సున్నిత‌మైన అంశాల‌పై తీసుకోవాల్సిన నిర్ణ‌యాల ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, టీటీడీ ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ఇత‌ర రాష్ట్రాల్లో తిరుమ‌ల శ్రీవారికి విరాళంగా దాత‌లు ఇచ్చిన ఆస్తుల‌ను వేలం ద్వారా విక్ర‌యించాల‌ని వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే పెద్ద ఎత్తున జ‌గ‌న్‌పై, ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

హిందుత్వాన్ని జ‌గ‌న్ నాశ‌నం చేయాల‌ని చూస్తున్నార‌ని బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించ‌డం ప్రారంభించారు. ఆస్తుల అమ్మ‌కం నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియా ద్వారా చ‌ర్చ మొద‌లైంది. అమ్మ‌కానికి తిరుమ‌ల అంటూ ఏకంగా తిరుమ‌ల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ్మేస్తోంది అంటూ జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం మొద‌లైంది. సేవ్ టీటీడీ ఫ్ర‌మ్ జ‌గ‌న్ అంటే సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ హిందూ వ్య‌తిరేకి అనే ముద్ర వేసేందుకు అబ‌ద్ధాల‌నే గ‌తంలో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగేలా ప్ర‌చారం చేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ తీసుకున్న నిర్ణ‌యం అర్థ‌వంత‌మైన ఆరోప‌ణ‌ల‌కు అవ‌కాశం ఉండ‌టంతో రెండురోజులుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఉద్య‌మం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే, ఇది టీటీడీ తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, ఈ నిర్ణ‌యానికి ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని టీటీడీ చెబుతోంది. నిర‌ర్థ‌క‌, నిర్వ‌హ‌ణ భారంగా మారిన ఆస్తుల‌ను అమ్మ‌డం కొత్తేమీ కాద‌ని 1974 నుంచి 129 ఆస్తుల‌ను టీటీడీ విక్ర‌యించింద‌ని వివ‌ర‌ణ ఇస్తోంది. ఇప్పుడు అమ్మ‌కానికి పెట్టిన ఆస్తుల‌ను గ‌తంలోనే టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే గుర్తించి అమ్మాల‌నుకున్నార‌ని టీటీడీ చెబుతోంది. అయితే, గ‌త అనుభ‌వాల‌ను, జ‌ర‌గ‌బోయే ప్ర‌చారాన్ని, అది చేసే న‌ష్టాన్ని గుర్తించ‌కుండా టీటీడీ అన‌వ‌స‌రంగా ఈ సున్నిత‌మైన అంశాన్ని ఇప్పుడు లేవ‌నెత్తి ఇప్పుడు న‌ష్ట‌నివార‌ణ‌కు వాద‌న‌లు చేస్తోంది. అయితే, ఈ వాద‌న‌లు నిజ‌మేనా, కాదా అనేది ప‌క్క‌న‌పెడితే ఈ విష‌యంలో మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంకా ఎక్కువే ఇబ్బంది ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   an hour ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   an hour ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   an hour ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   an hour ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   an hour ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   2 hours ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   2 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   14 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   21 hours ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle