newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

10-12-201910-12-2019 18:56:01 IST
Updated On 11-12-2019 09:47:52 ISTUpdated On 11-12-20192019-12-10T13:26:01.151Z10-12-2019 2019-12-10T13:25:57.378Z - 2019-12-11T04:17:52.662Z - 11-12-2019

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు దేశ చరిత్రలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు విస్మయానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ జరుగుతోందన్నారు. క్వశ్చన్ అవర్ జరుగుతుంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎలా అవకాశం ఇస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 

శాసనసభలో మంత్రులు పచ్చి బూతులు మాట్లాడుతూ సభను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చి 6నెలలు అవుతున్న ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, ఇచ్చిన మాటని తప్పి సీఎం టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీకి ప్రత్యేకంగా సీటు ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. 

హైదరాబాద్ ఉన్న భూములు, ఆస్తులు కాపాడుకోవడానికి టీడీపీ నుంచి వంశీ వెళ్లిపోయారని మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు,దయతో ఎమ్మెల్యే అయిన వంశీ ఓడిపోతాననే భయంతో రాజీనామా చేయడం లేదన్నారు. దమ్ముంటే వంశీ రాజీనామా చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తులపైన, బిజినెస్‌లపైన దాడులు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రోజా ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

గతంలో ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శలు చేసిన రోజా ఇప్పుడు వారిని ఓదార్చడం లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం అవడంపై మాట్లాడాలి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle