newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఇద్దరు స్టేటాధిపతులతో ఒక పీఠాధిపతి ఆత్మానంద ఆవిష్కారం

18-06-201918-06-2019 22:24:45 IST
Updated On 21-06-2019 15:19:58 ISTUpdated On 21-06-20192019-06-18T16:54:45.868Z18-06-2019 2019-06-18T16:54:12.133Z - 2019-06-21T09:49:58.114Z - 21-06-2019

ఇద్దరు స్టేటాధిపతులతో ఒక పీఠాధిపతి ఆత్మానంద ఆవిష్కారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘జగన్ గెలుపు కోసం విశాఖ శ్రీ శారదాపీఠం ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడింది. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షించింది’-అంటూ స్వరూపానంద స్వామి చేసిన వ్యాఖ్య తెలుగునాట సంచలనాన్ని సృష్టిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనతో దైవిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఒక పీఠాధిపతికి ఇలా ఒక రాజకీయ నాయకుణ్ణి ముఖ్యమంత్రిగా చూడాలని ఎందుకు అంత బలంగా అనిపించింది? ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. విశాఖ శ్రీ శారదాపీఠంలో గోడలు, పక్షులు, చెట్లు, పుట్టలు, వ్యక్తులు.. ఎవర్ని అడిగినా జగన్‌ గెలవాలి అన్న మాటే ఎందుకు వినిపించేది? ఇది యువ నేతపై కేవలం ప్రేమాభిమానమా? లేక చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అంతులేని ద్వేషమా? ఇదీ ఇప్పుడు జనం చర్చించుకుంటున్న టాపిక్! 

Image result for swamy swaroopa and jagan

జగన్‌ను అధికారంలో కూర్చోబెట్టాలనేదే స్వరూపానంద స్వామి ‘దృఢ దీక్ష’ అయితే అందుకు ప్రబల కారణమేంటనేది ప్రస్తుతానికి ఒక సందేహంగానే మిగిలిపోయింది. ఆ కారణమేంటో శారదా పీఠాధిపతి తన భక్తకోటికి వివరంగా, విడమరచి చెప్పలేదు. ‘జగన్ అంటే శ్రీశారదా పీఠం ప్రాణం పెట్టింది, జగన్‌ ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షించింది’ అని మాత్రమే చెప్పారు.  ఐతే, ఇక్కడే అసలు మేటర్ ఉంది. జగన్మోహన్‌రెడ్డిని సీయం చేయడమంటే మరో అర్థంలో చంద్రబాబును పదవీచ్యుతుణ్ణి చేయడమే. ‘జగన్‌ను కూర్చోబెట్టడం.. చంద్రబాబును దించడం..’ సూక్ష్మంగా చూస్తే ఈ రెండిటి అర్థం ఒకటే అయినా విడివిడిగా చూస్తే చాలా తేడా ఉంది. 

‘జగన్ కోసం విశాఖ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది’ అని శారదా పీఠాధిపతి మరో మాట కూడా అన్నారు. దీన్ని బట్టి చూస్తే, స్వామీజీ మాటల్లో ఏదో నిగూఢమైన అర్ధం వుండేవుంటుంది అని విశ్లేషకుల అంచనా. వారు ఊహిస్తున్నట్టు ఒకవేళ చంద్రబాబును పదవీచ్యుతుణ్ణి చేయడమే స్వరూపానందుడి అంతిమ లక్ష్యం అయితే అది చరిత్రలో నిలిచిపోవాల్సిన అంశమే. ఇక్కడే మనందరికీ ‘చాణక్య శపథం’ గుర్తొస్తుంది. ఒకసారి ఆ కథ గుర్తుచేసుకుందాం.

Image result for swamy swaroopa and kcr and jagan

 తనను ఘోరంగా అవమానించిన నంద వంశీయుల అధికార పీఠాన్ని అన్యాక్రాంతం చేస్తానని ప్రతిన పూని తక్షశిల వెళ్లిపోయాక చాణక్యుడు యోగ్యుడైన భావి చక్రవర్తిని అన్వేషించే పనిలో పడ్డాడు. ముడి వీడిన శిరోజాలు ప్రతీకార జ్వాలలై అనుక్షణం అతడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తున్నాయి. ఎదురవుతున్న ప్రతి యువకుడిలోనూ అతడు మగధ వారసుడినే చూస్తున్నాడు! కానీ ఎవరిలోనూ తనకు కావలసిన లక్షణాలు కనిపించడం లేదు. 

Image result for swamy swaroopa and jagan

ఈ క్రమంలో... చెట్లు, పుట్టలు, పల్లెలు, పట్నాలు గాలిస్తున్న చాణక్యుడికి లొఖాండీ అనే అటవీ ప్రాంతంలో (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో)... ఒక వేసవి ఉదయం, బాల భానుడితోపాటు, ప్రచండ భానుడిలాంటి బాలుడు చాణక్యుడి కంట పడ్డాడు. అతడే చంద్రగుప్తుడు! ఆ సమయంలో చంద్రగుప్తుడు.. క్రూరుడైన తన గురువును ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. ‘తమరు చేస్తున్నది తప్పు’ అని వాదిస్తున్నాడు. ‘చదువులో మాత్రమే మీరు నాకన్నా అధికులు. మనిషిగా నేను మీకన్నా అధికుడిని’ అని ధైర్యంగా అంటున్నాడు. చాణక్యుడికి ముచ్చటేసింది. నేరుగా బాలుడి తల్లి దగ్గరకు వెళ్లాడు. ‘‘నీ కుమారుడిని మగధకు చక్రవర్తిని చేస్తాను. నాతో పంపించు’’ అని అడిగాడు. అలా చంద్రగుప్తుణ్ణి చేరదీసి మగధ సామ్రాజ్యాధినేతను చేశాడు చాణక్యుడు.

చాణక్యుడి శపథం తరహాలో స్వరూపానందుడికి ‘అంతు చూసే పంత’మేదైనా ఉందా లేదా అనేది బాహ్య ప్రపంచానికి తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతానికి అయితే, ఇద్దరు ముఖ్యమంత్రుల ఆగమనంతో శారదా పీఠం ప్రపంచం దృష్టిని మాత్రం ఆకర్షించింది.  

సాధారణంగా పీఠాధిపతులు రాజకీయాలకు దూరంగా ఉంటారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ స్పూర్తితో పరిపూర్ణ స్వామి వంటి వారు ఇటీవలి కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వయంగా ఆయన ఆధ్వర్యంలో ‘భారత్ టుడే’ పేరుతో ఒక న్యూస్ ఛానల్ కూడా నడుస్తోంది. ఇతరత్రా కొన్ని తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానల్స్‌లో మరికొందరు స్వాములు పెట్టుబడులు పెట్టారన్న వాదన ఉన్నప్పటికీ అందులో యథార్ధమెంతో ఇతమిద్థంగా ఎవరికీ తెలియదు. తాజాగా శారదా పీఠంలో జరిగిన తంతు మాత్రం పీఠాధిపతులకు, స్టేటాధిపతులకు మధ్య ఉన్న ‘నాగార్జున సిమెంట్’ తరహా దృఢమైన బంధాన్ని ప్రజల ముందు మరోసారి ఆవిష్కరించింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle