newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

ఇద్దరు అల్లుళ్ళ రూటే సెపరేటు !

27-01-201927-01-2019 17:09:24 IST
Updated On 27-01-2019 20:55:10 ISTUpdated On 27-01-20192019-01-27T11:39:24.853Z27-01-2019 2019-01-27T11:39:08.150Z - 2019-01-27T15:25:10.067Z - 27-01-2019

ఇద్దరు అల్లుళ్ళ రూటే సెపరేటు !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్.టీ.రామారావు ఇద్దరు అల్లుళ్ళు రూటే సెపరేటు! పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు చిన్నల్లుడు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఎడ్డెమంటె తెడ్డేమే ! ఎన్టీఆర్ అధికారంలో ఉన్నపుడు ఎవరి గ్రూపులు వాళ్ళవి. ఒకరి మీద మరొకరు కారాలూ మిరియాలూ నూరుకునే టైపు. ఇప్పుడు దగ్గుబాటి కుమారుడు హితేష్ జగన్ పార్టీలో చేరిపోవడానికి తయారవుతున్న వేళ మళ్ళీ ఆ కుటుంబం వార్తల్లోకి వచ్చింది. 

ఎన్టీఆర్‌ను గద్దెదింపడానికి ఇద్దరు అల్లుళ్ళూ 1995 లో ఏకమయ్యారు. నీకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తానంటూ తనవైపు రప్పించుకున్న చంద్రబాబు ఆ తరువాత ఆ పని చేయలేదు. దాంతో దగ్గుబాటి దూరం జరిగారు. కొన్ని రోజులు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి ఆ తరువాత కాంగ్రెసులోకి వెళ్లిపోయారు. భార్య పురందేశ్వరి కూడా కాంగ్రెసులో చేరిపోయి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత దగ్గుబాటి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటే భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీ గూటికి చేరారు. ఏపీలో ముఖ్యమంత్రి అయిపోయిన బాబు వ్యవహారాలన్నింటిపైనా బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసేపనిలో పడిపోయారు. బాబు  అమరావతి కథలన్నీ పూసగుచ్చినట్లు అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందచేసింది ఆమేనని అంటారు. బాబు కూడా ఈ భార్యాభర్తల్ని దూరంగానే ఉంచారు. ఎన్టీఆర్ కుటుంబంలో వీళ్ళిద్దరినీ  బాబు ఎప్పుడూ దూరమే ఉంచారు. తనకు అవసరం అనుకున్నారో ఏమో గానీ బాలకృష్ణకు మాత్రం దగ్గరయ్యారు. వియ్యంకుడిగా మారారు. 

ఎప్పుడూ ఒక పార్టీలోలేని (వైస్రాయ్ తిరుగుబాటు ఉదంతం తప్ప) అల్లుళ్ళు ఇద్దరూ ఎదురుపడితే ముఖాలు కూడా చూసుకోలేని పరిస్థితి.  అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు బద్ద శత్రువు జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి తన కొడుకును చేర్పించి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించే పనిలో పడ్డారు దగ్గుబాటి. గతంలో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలవడంతో ఆ టిక్కెట్టును తన కొడుక్కి ఇప్పించాలన్నది దగ్గుబాటి ఆలోచన. విజయసాయి రెడ్డి తోడ్పాటుతో జగన్ని కలిసి వచ్చారు. ఇప్పుడు అదే నియోజకవర్గం ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రావి రాంబాబు ఆ టిక్కెట్టును ఆశిస్తున్నారు. అతన్ని కాదని దగ్గుబాటి కుమారుడు హితేష్‌కు టిక్కెట్టు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది చర్చ. మొత్తం మీద ఎన్టీఆర్ కుటుంబంలో ఇద్దరల్లుళ్ల రూటే సెపరేటు ! 2019 ఎన్నికల వేళ వీరి వ్యవహారశైలి ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   4 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   5 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   9 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   9 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   11 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   12 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   12 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   13 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   13 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle