newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఇద్దరు అల్లుళ్ళకు సమన్యాయం?

15-06-201915-06-2019 14:26:44 IST
Updated On 22-06-2019 12:44:12 ISTUpdated On 22-06-20192019-06-15T08:56:44.335Z15-06-2019 2019-06-15T08:50:26.767Z - 2019-06-22T07:14:12.168Z - 22-06-2019

ఇద్దరు అల్లుళ్ళకు సమన్యాయం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో తెలుగుదేశం పార్టీలో బాలయ్య అల్లుళ్ళ ఓటమిపైనే ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృ‌ష్ణ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి.

ఆయనకు భారీ మెజారిటీ వస్తుందని కార్యకర్తలు కామెంట్లు చేస్తే బాలయ్యకు మండింది. ఒకరిద్దరు కార్యకర్తలపై చేయి చేసుకున్న పనికూడా చేశారు. ఎలాగోలా ఆయన గట్టెక్కారు. కానీ తన ఇద్దరు అల్లుళ్ళను మాత్రం గెలిపించుకోలేకపోయారు. మంగళగిరి నుంచి పోటీచేసిన బాలయ్య పెద్దల్లుడు, ఏపీ మంత్రి లోకేష్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక‌ృష్ణారెడ్డిపై 5337 ఓట్ల తేడాతో ఘెరంగా ఓడిపోయారు.

అసలు మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎందుకు ఎంచుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అక్కడ ఆర్కె ప్రభంజనం గురించి చంద్రబాబుకి తెలియదా? మరో వైపు పెద్దల్లుడి గెలుపు కోసం బాలయ్య ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అంటున్నారు. స్వయానా సీఎం చంద్రబాబు తనయుడే మంగళగిరిలో ఓటమి పాలుకావడం కార్యకర్తలను కూడా నిరాశకు గురిచేసింది. 

విశాఖలో పోటీచేసిన బాలయ్యబాబు చిన్నల్లుడు ఎంవీవీఎస్ భరత్ కూడా ఓటమి పాలు కాక తప్పలేదు. తన ఓటమికి కారణాలేంటో భరత్ అన్వేషించారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే, భరత్ రాజకీయాలకు కొత్త. కేవలం తాత ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా మాత్రమే తెలుసు. అయినా విశాఖలో తీవ్రంగా నెలకొన్న త్రిముఖ పోటీలో భరత్ బాగానే బండి లాక్కుని వచ్చాడని చెబుతున్నారు.

తొలిసారి ఎన్నికల పోటీలో నిలిచిన భరత్‌ ప్రచారంలోనూ, పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ గట్టిగా ప్రయత్నించినా.. క్రాస్ ఓటింగ్ కారణంగా ఓడిపోయారు. ముఖ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేయడం భరత్‌‌ ఓటమికి ప్రధాన కారణం అంటారు. విశాఖ లోక్ సభ సీటులో భరత్ 4, 32, 492 ఓట్లు సాధించారు.

ఆయనకు పెద్దమ్మ వరుస అయ్యే బాలయ్య బాబు సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి 33, 892 ఓట్లు పొందారు. జనసేన అభ్యర్ధి లక్ష్మీనారాయణ మాత్రం 2, 88, 874 ఓట్లు సాధించారు. లక్ష్మీనారాయణకు పడ్డ ఓట్లు కారణంగానే భరత్ ఓడిపోయారని అంటున్నారు. విశాఖలో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ సాధించినవి మాత్రం 4, 36, 906 ఓట్లు మాత్రమే. అంటే రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం మినమా.. ఓడిపోయిన టీడీపీ మిగతా ఎంపీ అభ్యర్ధుల కంటే భరత్ ఇచ్చిన పోటీ ఎక్కువే అని చెప్పాలి. 

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇంత వరకు మీడియా ముందుకు రాని భరత్ తొలిసారి ఓటమిపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.  తాను క్రాస్ ఓటింగ్ కారణంగానే ఓడిపోయానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకుంటామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిలదీస్తామని భరత్ స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని తెలిపారు. తోడల్లుడు లోకేష్ తో పోలిస్తే భరత్ సాధించిన ఓట్లు ఎక్కువనే చెప్పాలి, ఇద్దరు అల్లుళ్ళ విషయంలో ఓటర్లు ఒకేరకమయిన తీర్పు ఇవ్వడంపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Newssting creative 
Image may contain: 2 people, people smiling, text

ఈ ఏడాది జనవరిలో వరుణ్ తేజ్, వెంకటేష్ కాంబినేషన్లో ఎఫ్ 2 మూవీ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) మూవీ వచ్చింది. సంక్రాంతి అల్లుళ్ళ సందడితో బాక్సాఫీస్ హిట్ కొట్టింది ఈ మూవీ. కానీ సమ్మర్ అల్లుళ్ళుగా వచ్చిన బాలయ్య అల్లుళ్ళ పొలిటికల్ మూవీ మాత్రం ఈవీఎంల బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అక్కడ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అయితే ఇక్కడ మాత్రం ఫ్యూరియస్ అండ్ ఫ్రస్ట్రేటెడ్‌గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గమనిక: ఈ ప్రత్యేక వార్తా కథనం కేవలం జస్ట్ ఫర్ ఫన్ కోసమే అని మనవి. ఎవరినీ కించపరచడం మా ఉద్దేశ్యం కాదు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle