ఇద్దరినీ ఇలా సెట్ చేశారు..!
23-11-201923-11-2019 07:48:50 IST
Updated On 23-11-2019 17:47:32 ISTUpdated On 23-11-20192019-11-23T02:18:50.397Z23-11-2019 2019-11-23T02:18:33.478Z - 2019-11-23T12:17:32.274Z - 23-11-2019

మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ జగన్ ప్రభంజనం వీచినా విజయవాడ తూర్పులో మాత్రం ఆ పార్టీకి బ్రేకులు వేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్. నగరంలోని సెంట్రల్, ఈస్ట్ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా తూర్పులో మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఆ పార్టీ తరపున రెండోసారి ఇక్కడ గద్దె రామ్మోహన్ 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున గద్దె రామ్మోహన్‌కు కంచుకోటగా మారిన తూర్పు నియోజకవర్గంపై వైసీపీ దృష్టి పెట్టింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా రాజధానిగా ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నగరంలో వైసీపీ గెలిచినా టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటికీ నగరంలో టీడీపీ బలంగా ఉంది. దీంతో ఇప్పటి నుంచే వైసీపీ నగరంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో బలోపేతం అయ్యేందుకు పక్కా స్కెచ్ వేసింది. పార్టీలో చేరగానే దేవినేని అవినాష్‌కు బాధ్యతలు నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. తూర్పు నియోజకవర్గంలో ఇంతవరకు వైసీపీకి టీడీపీతో ఢీకొనే బలం లేదు. 2014లో వైసీపీ తరపున వంగవీటి రాధా పోటీ చేయగా ఆయనపై గద్దె రామ్మోహన్ 15 వేల మెజారిటీతో గెలిచారు. 2019లో వైసీపీ ఇక్కడ అభ్యర్థి విషయంలో బాగా ఇబ్బంది పడింది. ఎన్నికల నాటికి ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఉండే వారు. కానీ, చివరి నిమిషంలో ఆయనను తప్పించి బొప్పన భవకుమార్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఆయన 15 వేల ఓట్లతో ఓడిపోయారు. గద్దే రామ్మోహన్‌కు స్థానికంగా మంచి పేరు ఉండటంతో ఆయన జగన్ హవాలోనూ సులువుగా విజయం సాధించారు. విజయవాడ నగరంలో దేవినేని కుటుంబానికి మంచి పట్టుంది. 2009, 2014లో దేవినేని నెహ్రు ఇక్కడి నుంచి పోటీ చేశారు. అవినాష్‌కు కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి ఉండటంతో వైసీపీ వెంటనే ఆయనకు తూర్పు బాధ్యతలు అప్పగించింది. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తూర్పులో ఆధిక్యత చూపించాల్సిన టార్గెట్ ఆయనపై పార్టీ పెట్టింది. ఇక, ఎన్నికల్లో ఓడి మొన్నటి వరకు ఇంఛార్జిగా ఉన్న బొప్పన భవకుమార్‌ను సైతం జగన్ బుజ్జగించారు. ఆయనకు విజయవాడ నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు ఈ పదవిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. నగర బాధ్యతలతో పాటు, కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను కూడా బొప్పన భవకుమార్పైనే పెట్టింది వైసీపీ. అంతేకాదు, మేయర్ అభ్యర్థి కూడా ఆయనే అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు అవినాష్, భవకుమార్ మధ్య సఖ్యత ఉన్నా, మున్సిపల్ ఎన్నికల వరకు ఇలానే ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతల అనుచరులు కార్పొరేటర్ టిక్కెట్లకు పోటీ పడే అవకాశం ఉంది. ఇక, ఇద్దరు నేతలనూ జగన్ ఒకేసారి సెట్ చేయడంతో పాటు విజయవాడ కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇక, పార్టీలో చేరగానే కోరుకున్న నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం, భవకుమార్తోనూ సమస్యలు లేకుండా చూడటం పట్ల దేవినేని అవినాష్ సంతోషంగా ఉన్నారు. ఇక, తూర్పులో గద్దె రామ్మోహన్‌కు అవినాష్ చెక్ పెట్టగలరా అనేది చూడాలి.

కాంగ్రెస్‌లో ఆ నలుగురూ ఒక్కటవుతున్నారట..!
2 hours ago

జగన్ ఎఫెక్ట్.. ఫుల్ బిజీగా ప్రశాంత్ కిషోర్..!
2 hours ago

పవన్ పార్టీలో ఏమిటీ పరేషాన్ ..?
3 hours ago

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019
ఇంకా