newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

ఇదో రాజకీయ రంగుల కొత్త రకం ‘పంచాయితీ’

05-09-201905-09-2019 09:17:54 IST
Updated On 05-09-2019 13:09:40 ISTUpdated On 05-09-20192019-09-05T03:47:54.663Z05-09-2019 2019-09-05T03:47:41.032Z - 2019-09-05T07:39:40.514Z - 05-09-2019

ఇదో రాజకీయ రంగుల కొత్త రకం ‘పంచాయితీ’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు?

అక్టోబర్ 2 నుంచి పంచాయితీల పాలన మారబోతోందా?

 అధికార పార్టీ పంచాయితీ కార్యలయాల రంగులు మార్చబోతోందా? 

ఏపీలో ఏం జరగబోతోంది?

సీఎం జగన్ కొత్త నిర్ణయం గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీయబోతోందా? 

వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల అడ్డాగా పంచాయితీలు మారబోతున్నాయా?

ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ తన పార్టీ రంగుల్ని ప్రతిబింబించేలా నిర్ఱయాలు తీసుకుంటోంది. తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పద అవుతోంది. 

కలెక్టర్ల నుంచి వచ్చిన ఉత్తర్వులతో పంచాయితీ భవనాల రంగులు మారబోతున్నాయని తెలుస్తోంది. వైసీపీ పార్టీకి చెందిన మూడురంగులతో పాటు ప్రతి పంచాయితీలోనూ జగన్ ఫోటో ఒకటి తప్పకుండా ఏర్పాటుచేయాలని పంచాయితీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో గ్రామాల్లో అధికార, విపక్ష నేతల మధ్య ఆధిపత్యపోరు కనిపించనుంది. ఇది ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

పంచాయితీ సెక్రటేరియట్ నేమ్ బోర్డులలో జగన్ ఫోటో అతికించాల్సి వుంటుంది. పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈమేరకు ఆయా గ్రామపంచాయితీలకు సూచనలు పంపించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఈ సూచనలు అమలుచేయాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో 10మంది ఉద్యోగులు ఉండనున్నారు. అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారులకు అందాలని కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. 

ప్రభుత్వం పంచాయితీ కార్యాలయాలకు రంగులు మార్చడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పంచాయితీల్లో ఉద్యోగులు, వాలంటీర్ల పేరుతో వైసీపీ తన కార్యకర్తలు, మద్దతుదారులకు ఉద్యోగాలు ఇస్తోందని, పంచాయితీలను రాజకీయ అడ్డాలుగా మారుస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పంచాయితీలపై మితిమీరిన రాజకీయ పెత్తనం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రభుత్వ తాజా నిర్ఱయం కారణంగా వివిధ గ్రామాల్లో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైసీపీ-టీడీపీ నేతలు పరస్పరదం దాడులకు తెగబడుతున్నాయి. దీంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. వైసీపీ దాడులు, ప్రభుత్వ తాజా నిర్ణయాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం చంద్రబాబునాయుడు కోరిన సంగతి తెలిసిందే. 

ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే:బీజేపీ నేత లంకా దినకర్

పంచాయితీ కార్యాలయాలకు రాజకీయరంగులు పులమడం సమంజసం కాదన్నారు బీజేపీ నేత లంకా దినకర్. పంచాయితీ కార్యాలయాలను రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మార్చడం అలవాటుగా మారిపోయిందన్నారు. ఆయన ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి సంప్రదాయమే కొనసాగించిందని చురకలు అంటించారు. 

ఇలాంటి సంప్రదాయం ప్రాంతీయపార్టీల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీల పటిష్టానికి అనేక సంస్కరణలు చేపట్టిందని పార్టీ రంగులు వేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. తమ పార్టీ రంగులతో కార్యాలయాలు ఏర్పాటుచేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు దినకర్.  

గతంలో ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంచాయితీ భవనాల రంగులు మార్చలేదని, వైసీపీ విధానం అస్తవ్యవస్త పాలనకు నిదర్శనమని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నేత సూర్యనారాయణరాజు ‘న్యూస్ స్టింగ్’ తో చెప్పారు.

పంచాయితీ భవనాలకు రంగులు మార్చడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఆయన అన్నారు. పాలనలో ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. వందరోజుల పాలనపై ప్రజలు అసహనంతో ఉన్నారని. విసుగెత్తిపోతున్నారన్నారు. ఒకవేళ వైసీపీ రంగులు వేయాలనుకుంటే తమ పార్టీ భవనాలకు వేసుకోవాలని సూర్యనారాయణరాజు సూచించారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle