newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఇదేం పరిపాలన.. జగన్ ప్రభుత్వానికి క్యాట్ అక్షింతలు!

27-02-202027-02-2020 11:15:38 IST
Updated On 27-02-2020 11:23:36 ISTUpdated On 27-02-20202020-02-27T05:45:38.910Z27-02-2020 2020-02-27T05:45:27.327Z - 2020-02-27T05:53:36.288Z - 27-02-2020

ఇదేం పరిపాలన.. జగన్ ప్రభుత్వానికి క్యాట్ అక్షింతలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ సర్కారుకి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) సీఈవోగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) కమిషనర్‌ గా ఉన్న ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) రద్దు చేస్తూ ఉతత్రులు ఇచ్చింది. అయన సస్పెండ్ చట్టవిరుద్దమంటూ ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టింది.

నిజానికి జాస్తి విషయంలో ప్రభుత్వం కక్ష్య సాధింపుకి పాల్పడుతుందని రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు అందరికీ తెలిసిందే. గతంలో ఇప్పుడు సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్ ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని అదే విషయంపై హెచ్చరించింది. తప్పు చేసారని అనుమానిస్తే ఈడీబీ సీఈఓగా తొలగించడం సబబే కానీ సస్పెండ్ చేసి వేధించడం సమంజసం కాదని తెలిపింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఉన్న అయనను వెంటనే ఆదాయ పన్ను శాఖలో చేర్చుకోవాలని క్యాట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కృష్ణకిశోర్‌పై ఉన్న కేసుల్లో చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ ఏపీ ప్రభుత్వానికి మాత్రం చివాట్లు పెట్టింది. ఈవోగా తొలగించాక సస్పెండ్‌ చేసి మాతృసంస్థకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.

మీ చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా చెలాయిస్తామంటే చట్టం అనుమతించదని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించింది. అసలు సీఈవోగా డిప్యుటేషన్‌పై వచ్చిన కేంద్ర అధికారిని ఎక్స్‌అఫీషియో సెక్రటరీగా రాష్ట్ర సర్వీసుల్లోకి చట్టవిరుద్ధంగా తీసుకోవడానికి మీకు ఏ అధికారం ఉందని ప్రశ్నించింది. సీఈవోగా ఉంటే కుదరదని కక్షసాధించడానికే జీఏడీకి మార్చినట్లున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణకిశోర్‌ తప్పుచేశాడని చెబుతున్న ప్రభుత్వం ఏంతప్పు చేసారో చెప్పాలని నిలదీశారు. ఆయనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన మాతృసంస్థ ఆదాయ పన్ను శాఖకు సమాచారమిచ్చారా అని చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు సీఎం కార్యాలయం అదనపు సీఎస్‌ కున్న అధికారాలేంటి? మండలి సీఈవోపై చర్య తీసుకునేందుకు ఆయనెవరు? ఇదేం పరిపాలన అంటూ అక్షింతలేసింది.

జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన దగ్గర నుండి అటు ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు ఇలా టార్గెట్ చేసిన ఉద్యోగులకు కూడా కక్ష్యసాధింపుకి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. పలుమార్లు కోర్టుకు ప్రభుత్వనికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నది తాజా క్యాట్ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. మరి ప్రభుత్వం ఇకనైనా ఆ తరహా చర్యలను స్వస్తి చెప్తుందా?!

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   14 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle