newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఇదెక్కడి చోద్యం.. మీరిస్తామంటే ప్రజలు వద్దన్నారా?!

04-10-201904-10-2019 18:40:42 IST
2019-10-04T13:10:42.779Z04-10-2019 2019-10-04T13:10:39.045Z - - 14-08-2020

ఇదెక్కడి చోద్యం.. మీరిస్తామంటే ప్రజలు వద్దన్నారా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వాలు ఇస్తామంటే ఎక్కడైనా ప్రజలు వద్దంటారా? అసలే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. పదో పరకో ఇచ్చినా ఉప్పు-పప్పు.. అందులో ఉల్లికి వచ్చినా వస్తాయ్. ఇదే అనుకుంటారు సామాన్య ప్రజలు. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వం ఇస్తామంటున్న ప్రజలే వద్దంటున్నారట. ఈ మాట మేము చెప్పడం లేదు ఆ ప్రభుత్వమే చెప్తుంది. ఇంతకీ ఏమిస్తామన్నారు.. ప్రజలు ఏం వద్దంటున్నారు? అంటారా.. వైసీపీ నవరత్నాలలో ఒకటైన వైఎస్సార్ వాహన మిత్ర పథకం తెలుసుకదా.

గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం ప్రకటించారు. కొంతమేర ఇచ్చారు కూడా. మళ్ళీ అధికారంలోకొస్తే ఐదేళ్లపాటు ఆ పథకం కొనసాగిస్తాన్నారు. అప్పుడే జగన్ కూడా ప్రచారంలో భాగంగా నవరత్నాలలో ఒకటిగా అలాంటి పథకమే ప్రజలలోకి తెచ్చారు. కాదు కాదు మేమే ముందని ఇద్దరూ కీచులాడుకున్నారు. అదంతా గతం. ప్రస్తుతానికొస్తే రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ నడుపుకునే డ్రైవర్లకు ప్రతిఏడాది 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్ఆర్ వాహనామిత్ర పథకం తీసుకొచ్చారు.

ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించిన సెప్టెంబర్ 9వ తేదీన ఈ పథకం అమలుకు మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తూ జీవో కూడా విడుదల చేసింది. ఈరోజు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో పథకాన్ని స్వయంగా సీఎం ప్రారంభించి కొంతమందికి లబ్ధిదారులకు మంజూరు పాత్రలను అందిస్తారు. ప్రభుత్వం ఓ పథకం తెస్తుంది అంటే మాకు కావాలంటే మాకు కావాలని ప్రజలు ఎగబడతారు. కానీఈ పథకం కోసం కేటాయించిన బడ్జెట్ మొత్తానికి సరిపడా కూడా లబ్ధిదారులు లేరని ప్రభుత్వమే చెప్తుంది.

నిజానికి పథకం ప్రకటించిన సమయంలో దాదాపు ఏడులక్షల పైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా వేశారు. ఇందుకోసం సుమారు ఏడువందల కోట్లు కూడా కావాల్సిఉంటుందనుకున్నారు. కానీ పథకానికి అర్హులు వీళ్ళే అంటూ ప్రభుత్వం ఓ జాబితాను మార్గదర్శకాలలో విడుదల చేసింది. దాని ప్రకారంగా ఏడు లక్షలన్నది రెండు లక్షలకు పడిపోయింది. ప్రభుత్వం పెట్టిన నిబంధనల కొర్రీల ప్రకారం ఆన్ లైన్ లోనూ, ఆప్ లైన్లోనూ లక్షా 75 వేల 352 దరఖాస్తులు ఆర్థిక సాయం కోసం అందాయి.

ఇక ప్రభుత్వానికి అందిన దరఖాస్తులలో లక్షా 73 వేల 102 దరఖాస్తులకు ఫైనల్ గా ఆర్థికసాయం ఇవ్వనున్నట్లుగా డిక్లేర్ చేసింది. అంటే అంతా కూడా 174 కోట్లను వైఎస్ఆర్ వాహన మిత్రలో అందించి తాము కూడా పథకాన్ని అమలుచేశామని మమా అనిపించుకుంటుంది. మరి బడ్జెట్ లో 400 కోట్లు కేటాయించారు కదా అని అడిగితే మేము ఇస్తామంటున్నా ప్రజలే వద్దంటున్నారని సమాధానం వస్తుంది. కొద్దిపాటి నిబంధనలు సడలిస్తే బడ్జెట్ లో కేటాయించిన మొత్తానికి సరిపడా అయినా లబ్ధిదారులు వస్తారని డ్రైవర్ బాబులు బాధపడిపోతున్నారు. కానీ నిబంధనలు పెట్టిందే భారం అవుతుందని కదా బాబులు! పథకం అమలు అమలౌతుంది.. కాకపోతే కండిషన్స్ అప్లై!!

 

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   15 minutes ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   2 hours ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   2 hours ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   2 hours ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   3 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   3 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   4 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   17 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   18 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle