newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఇదీ జగన్ సత్తా... బాబుకి సవాల్

17-03-201917-03-2019 15:39:15 IST
2019-03-17T10:09:15.632Z17-03-2019 2019-03-17T10:08:51.984Z - - 17-07-2019

ఇదీ జగన్ సత్తా... బాబుకి సవాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. వాడే పండుగాడు..’ ఇది పోకిరి డైలాగ్. ఇప్పుడు జగన్ అభిమానులంతా జగన్ గురించే ఇదే మాట వాడుతున్నారు. ఒకేసారి 175 అసెంబ్లీ సీట్లకు తన పార్టీ అభ్యర్ధుల జాబితా ప్రకటించి ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అన్ని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే టిక్కెట్ల కేటాయింపు జరిగినట్లు అర్థం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 41 మంది బీసీలకు ఈసారి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చారు జగన్. బీసీలు అంతా తమవైపే ఉన్నారన్న టీడీపీ వాదనకు చెక్ పెట్టడానికి జగన్ ఈ ప్రయత్నం చేసినట్లు అర్థం అవుతోంది.

అలాగే ఈసారి 15 మంది మహిళలకు సీట్లు కేటాయించిన జగన్, ఎస్సీలకు 29 సీట్లు, ఎస్టీలకు 7 సీట్లు, ముస్లింలకు 5 సీట్లు కేటాయించారు. అలాగే జగన్ ఎన్నికల అభ్యర్థుల జాబితా చూస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. బీసీలతో పాటు అనుభవం ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చినట్లు అర్థం అవుతోంది. వైసీపీ జాబితాలో 9 మంది ఆలిండియా సర్వీసులో పని చేసిన వారు ఉన్నారు. 15 మంది డాక్టర్లు, 41 మంది పీజీ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

ఇక 175 మంది అభ్యర్ధుల్లో 33 మంది యువకులు. అంటే 45 ఏళ్ల వయసు లోపు వారే. ఇక 40 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలకు అవకాశం ఇచ్చిన జగన్... 119 మంది ఎంపీలుగా, ఎంఎల్ఏలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా గతంలో పని చేసిన అనుభవం ఉన్నవారు. ఇక బీసీలకు 41 అసెంబ్లీ సీట్లు, 7 లోక్ సభ సీట్లు కేటాయించి తన మార్క్ ఏంటో చూపించారు జగన్. బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తానని ఏలూరు బీసీ గర్జనలో చెప్పిన జగన్... తన మాట నిలబెట్టుకున్నట్లు అర్థం అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో క్షత్రియులకు కూడా తగినన్ని సీట్లు కేటాయించారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle