newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

19-02-202019-02-2020 13:13:35 IST
2020-02-19T07:43:35.515Z19-02-2020 2020-02-19T07:43:33.572Z - - 07-04-2020

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే వున్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలన మించిపోయిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి నిప్పుల పొయ్యిలో పడినట్లు ఉందన్నారు. వైసీపీ పాలన రద్దులు, వేధింపుల మాదిరిగా మారిందని, శాసన మండలి రద్దుతో జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి వెన్ను పోటు పొడిచారన్నారు. 

జగన్‌కు అహంభావం, అహంకారం ఎక్కువేనన్నారు. జగన్  చేతికి ఏకే 47 గన్ ఇచ్చిన మాదిరిగా ఉందని, ఎన్నికల్లో గొప్పగా చెప్పిన నవరత్నాలు తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉండాలని, కానీ మూడు రాజధానులతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారన్నారు. రైతు భరోసా లో రూ 5000 కోత విధించి ఇచ్చారని, పింఛన్లు రేషన్ కార్డులు రద్దు చేశారన్నారు. రాష్టానికి బిజెపి చేసిన ద్రోహం చరిత్రలో ఏ పార్టీ కూడా చేయలేదన్నారు. 

ఆంధ్ర రాష్ట్రాన్ని 58 సంవత్సరాల పాటు 16 మంది  ముఖ్యమంత్రులు పాలనలో లక్ష కోట్ల అప్పు చేస్తే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లలో  లక్ష 50 వేలకోట్ల అప్పు చేయగా జగన్  ఎనిమిది నెలల్లో 50 వేల కోట్ల అప్పు చేశారని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.

ప్రభుత్వం ఆస్తులు అమ్మి పరిపాలన సాగిస్తున్నట్టుగా ఉందన్నారు తులసిరెడ్డి. రెండురోజుల క్రితం వైసీపీ-బీజేపీ మైత్రిని వన్ సైడ్ లవ్ అని వ్యంగ్యంగా విమర్శించిన తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం కృషిచేస్తున్నామన్నారు. 

బిజెపి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెడితే.. బీజేపీ వైపు వైసీపీ మొగ్గుచూపడం దారుణం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీ  లన్నింటినీ బిజెపి తుంగలో తొక్కిందన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ కోరినట్లుగానే ఏపీ ప్రజలు జగన్ ని సీఎంని చేశారని, కాని ఏపీ ప్రజలు ఆశించినంత అభివృద్ధి చేయలేకపోవడం దురదృష్టకరం అన్నారు తులసిరెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా తులసిరెడ్డి చెప్పారు.

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   14 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle