newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఇది మాఫియా సర్కార్.. చంద్రబాబు ఫైర్

04-12-201904-12-2019 08:34:20 IST
2019-12-04T03:04:20.054Z04-12-2019 2019-12-04T03:03:50.128Z - - 28-02-2020

ఇది మాఫియా సర్కార్.. చంద్రబాబు ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరునెలల సీఎం జగన్ పాలనపై విపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాఫియాలా మారారని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు నియోజకవర్గాలకు చెందిన వివిధ మండలాల టీడీపీ నాయకులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా జగన్ పాలనపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో జగన్  అంత విచిత్రమైన నాయకుడిని చూడలేదని ఎద్దేవా చేశారు. తమ నేతలు, కార్యకర్తలపై కూర్చుంటే కేసు, నిలబడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి ఉంటే మీ పార్టీ ఉండేదా అని ఆయన  ప్రశ్నించారు. ఈసందర్భంగా తమ హయాంలో చోటుచేసుకున్న కోడికత్తి కేసును జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు. 

తన స్వంత బాబాయి వివేకా హత్యకేసులో ఏం పురోగతి సాధించారని ప్రశ్నించారు.  గతంలో తమ హయాంలో ప్రజలకు ఇసుక ఉచితంగా అందించామని ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు, లారీ ఇసుక రూ.10 వేలు చేశారని విమర్శించారు. ఇసుక విధానాన్ని ఎందుకు మార్చారని,  దీనివల్ల 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్యహత్యలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. 

రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు మాఫియా చేతుల్లోకి వెళ్లాయని, కర్నూలు ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాఫియాలా మారారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో జరిగిన పశువైద్యురాలు దిశ దారుణ హత్యపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 'దిశ'ను దారుణంగా చంపేశారనీ... అలాంటి మానవ మృగాలకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఆరునెలల జగన్ పాలనా కాలంలో కష్టాలు పెరిగిపోయాయని టీడీపీ ఒకవీడియో విడుదల చేసింది. 

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   43 minutes ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   4 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   4 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   8 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   9 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   10 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   11 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   11 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   12 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle