newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఇతర రాష్ట్రాల్లోని ఆంద్రులకూ ఆరోగ్యశ్రీ వర్తింపు..

21-09-201921-09-2019 18:16:20 IST
2019-09-21T12:46:20.414Z21-09-2019 2019-09-21T12:35:20.546Z - - 16-11-2019

ఇతర రాష్ట్రాల్లోని ఆంద్రులకూ ఆరోగ్యశ్రీ వర్తింపు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థలను సమూలంగా మార్చివేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తూ చర్యలు తీసుకుంటోంది. వెయ్యి రూపాయలకు మించి వైద్య ఖర్చులు భరించాల్సిన ప్రతి రోగికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం దాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి దక్షిణభారత ప్రధాన నగరాలన్నింటిలో వర్తింపచేయనున్నట్లు తెలిపింది.

తన తండ్రి వైఎస్సార్ మానసపుత్రిక అయిన రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకానికి మరింత హంగులు కల్పిస్సూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా పథకం పేరును మార్చిన వైఎస్ జగన్ దక్షిణాదికి 1 50 సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రులకు ఈ పథకాన్ని విస్తరించింది. దీంతో ఆంద్రప్రదేశ్ వాసులై ఉండీ వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, బతుకు తెరువు రీత్యా ఏపీకి వెలుపల వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రజలందరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 

రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు చేపట్టాల్సిన సంస్కరణలపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సుజాత రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక అందించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా కొన్ని వ్యాధులు తీసుకురావాలని ప్రతిపాదించిన నేపధ్యంలో జనవరి 1 నుండి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీపై పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని సీఎం చెప్పారు. జనవరి 1 నుండి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీపై పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. 

పైలట్ ప్రాజెక్టు అమలు తీరుతెన్నులు పరిశీలించిన తర్వాత 2020 ఏప్రిల్‌ 1 నుంచి వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడేవారికి పెన్షన్ అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకున్న వారికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

తలసేమియా, కుష్టువ్యాధి, పుట్టుకతో వచ్చే హెచ్ఐవి, బోధకాలు, పక్షవాతం బాధితులకు ఐదు వేల రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఏపీలో వీలైనంత తొందరగా ఈ పెన్షన్ స్కీం అమలు చేయాలని దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇచ్చే పథకం ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యశాఖ ప్రక్షాళనకు నడుం బిగించి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకం కార్పొరేట్ ఆసుపత్రుల్లో సామాన్యులకు అత్యున్నత వైద్యాన్ని అందిస్తూ లక్షలాదిమంది జీవితాలను మెరుగుపర్చిన వైనం తెలిసిందే. జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారిన ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కొత్త నిర్వచం ఇస్తోంది. ఇది పూర్తి స్థాయిలో, లోపరహితంగా అమలైన నాడు ఆరోగ్య రంగం ఏపీలో కొత్త లెవెల్‌కు చేరినట్లే అవుతుంది. నవంబర్ 1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేయనుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle