newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటున్న మంత్రి సుభాష్ చంద్రబోస్

13-09-201913-09-2019 17:38:03 IST
2019-09-13T12:08:03.294Z13-09-2019 2019-09-13T12:07:59.524Z - - 28-05-2020

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటున్న మంత్రి సుభాష్ చంద్రబోస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కీల‌క మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ జ‌గ‌న్ క్యాబినేట్‌లో రెండో స్థానం అని చెప్పుకునే ప‌ద‌విని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అలా ప‌ద‌వి విష‌యంలోనే కాదు ఇత‌ర కీల‌క విషయాల్లోనూ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కి సీఎం జ‌గ‌న్ వ‌ద్ద మంచి పేరే ఉంది. సౌమ్యుడిగా పేరు ఉన్న సుభాష్ గత ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌విచూసినా మంత్రి ప‌ద‌విని క‌ట్టబెట్టారు సీఎం జ‌గ‌న్‌. అందుకు త‌గ్గ‌ట్టే ఆయ‌న కూడా శాఖాప‌రంగా కానీ, ఇత‌ర‌త్రా విష‌యాల్లో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురాకుండా అత్యంత జాగ్ర‌త్త‌గా న‌డుచుకుంటున్నార‌నే చెప్పాలి.

అత్యంత వివాద‌స్ప‌ద రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్, స్టాంప్స్ శాఖ నిర్వ‌హిస్తున్నా, అవినీతికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే విభాగాల‌ను చూస్తున్నా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ మీద మాత్రం ఇప్పటి వ‌ర‌కు ఎటువంటి అవినీతి మచ్చప‌డ‌లేదు. ఈ క్ర‌మంలో శాఖాప‌ర‌మైన విష‌యాల్లోనే కాకుండా జిల్లాకు సంబంధించి ఏవైనా సిఫార్సులు, అర్జీలు ఉంటే వాటిని ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌.

త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన అర్జీలు నిజ‌మైన‌వేనా..? స‌హేతుక‌మైన‌వేనా..? అనే విషయాన్ని ప‌రిశీలించి మ‌రీ వాటిని సిఫార్సు చేయాలా..? వ‌ద్దా..? అనే విష‌యాన్ని పిల్లి సుభాస్ చంద్ర‌బోస్ నిర్దారిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆ క్ర‌మంలో ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చే కొన్ని అర్జీలు స‌ద‌రు మంత్రికి చికాకు పుట్టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆ క్ర‌మంలోనే, అమ‌లుకు వీలుకాని విష‌యాలు, అస‌లు వివాదాల‌కు దూరంగా ఉండే వ్య‌వ‌హారాలను చేసి పెట్టాల్సిందిగా మంత్రి సుభాష్ చంద్ర‌బోస్ వ‌ద్ద‌కు అర్జీలు వస్తున్నాయ‌ట‌. వాటిని చూడ‌గానే మంత్రికి చిర్రెత్తుకొస్తున్న‌ట్టు మంత్రివ‌ర్గ కార్యాల‌య సిబ్బంది చెబుతున్నారు. 

అలానే ఓ ప్ర‌భుత్వ వైద్యుడు, చిన్న పిల్లల నిపుణుడు ఒకాయ‌న జిల్లా కేంద్రానికి బ‌దిలీ చేయించుకోవాల‌ని భావించాడ‌ట‌. అయితే స‌ద‌రు ఆస్ప‌త్రిలో చిన్న పిల్లల నిపుణుల‌కు సంబంధించిన పోస్టు ఖాళీగా లేదు. అదే ఆస్ప‌త్రిలో కంటి నిపుణుల‌కు సంబంధించిన పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఆ స్థానంలోకి త‌న‌ను బ‌దిలీ చేయాల‌ని స‌ద‌రు మంత్రిపై ఆ వైద్యుడు తెగ ఒత్తిడి తెస్తున్నాడ‌ట‌. ఇదంతా తెలుసుకున్న మంత్రి ఇదెలా సాధ్య‌మ‌వుతుంద‌ని అంటే ఏం ప‌ర్వాలేదు సార్ అన్నాడ‌ట‌. దీంతో స‌ద‌రు వైద్యుడికి అక్షింత‌లు వేసి పంపార‌ట మంత్రి.

Image result for pilli subhash chandra bose with jagan

అలాగే పిల్లి సుభాష్ గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గానికి ఇరిగేష‌న్ డీఈ కార్యాల‌యం మంజూరైంది. దాన్ని త్వ‌ర‌లోనే ప్రారంభించాల‌ని, ఆ మంత్రి సంక‌ల్పించారు. ఆ డీఈ కార్యాల‌యాన్ని ఇప్పుడు ప్రారంభించొద్ద‌ని, వ‌చ్చే ఏడాది ప్రారంభించాలంటూ స‌ద‌రు మంత్రిపై ఒత్తిడి వ‌చ్చిందంట‌. దీంతో, ఇదేంటి..? అతి క‌ష్టం మీద డీఈ కార్యాల‌యాన్ని తెస్తే ఇప్పుడు ప్రారంభించ‌వ‌ద్దు వ‌చ్చే ఏడాది ప్రారంభించ‌మ‌ని త‌న‌పై ఒత్తిడి తెస్తున్నారేంటి..? అంటూ ఆరా తీశారంట మంత్రి సుభాష్‌. ఇప్పుడే డీఈ కార్యాల‌యాన్ని ప్రారంభించేస్తే ఇప్ప‌ట్నుంచే అక్క‌డ విధులు నిర్వ‌హించాల్సి వ‌స్తుంద‌ని భావించిన అధికారులు వాయిదా వేయాల‌ని కోరిన‌ట్టు మంత్రి విచార‌ణ‌లో తేలింది.

దీంతో మంత్రి సుభాష్‌ చంద్ర‌బోస్ అస్సలు కుదరదు. నిర్మాణం అయిన వెంట‌నే ప్రారంభించాల్సి ఉంటుందంటూ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసేశార‌ట‌. ఇలా సీఎం జ‌గ‌న్ త‌న‌కు అప్ప‌గించిన శాఖ‌ల విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తూ ఎటువంటి అవినీతి మ‌ర‌క రాకుండా మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారన్న చ‌ర్చ రాజ‌కీయ వర్గాల్లో సాగుతోంది.

 

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   9 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   9 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   11 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   15 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   15 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   17 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   20 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   20 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   21 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle