newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఇక పర్యావరణ హిత ఆంధ్రప్రదేశ్

06-12-201806-12-2018 17:56:56 IST
Updated On 06-12-2018 17:59:56 ISTUpdated On 06-12-20182018-12-06T12:26:56.278Z06-12-2018 2018-12-06T12:26:50.783Z - 2018-12-06T12:29:56.781Z - 06-12-2018

ఇక పర్యావరణ హిత ఆంధ్రప్రదేశ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమయిందని సీఎం చంద్రబాబు అంటున్నారు. పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచడానికి విద్యుత్తు కార్లు ఎంతో దోహదపడతాయని ఆయన అంటున్నారు. భవిష్యత్తులో ఏపీలో సౌరవిద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే లభించడం ఖాయం అంటున్నారు. అమరావతి సచివాలయంలో కియా కార్లు, ఛార్జింగ్‌ స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు ఎలక్ట్రికల్ కారులో ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. కియా కారు సౌకర్యవంతంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ తయారైన కియా కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం కియా అడుగుపెట్టడంతో పూర్తిగా మారిపోయిందని, ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. 7300 మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను త్వరలో వ్యర్థం సేకరణ ప్రక్రియలో వినియోగించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 

కారెక్కిన బాబు 

ఈ సందర్బంగా ఏపీఐఐసీ ఎండీ ఎ. బాబు, కియా మోటర్స్ సీఈవో షిమ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా కియా మోటార్స్ ఇచ్చింది. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంది. మూడు రకాల కార్లను కియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వగా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించారు. వీటికి సంబంధించి ఆయన ఎలక్ట్రిక్ ఛార్జింగ్‌ స్టేషన్‌ను సచివాలయంలో ఆయన అందుబాటులోకి తెచ్చారు. కియా కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రారంభించి టెస్ట్ డ్రైవ్‌ను సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించే వాహనాల ప్రోత్సాహకానికి కియా సంస్థతో ఈ మేరకు ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా ‘భవిష్యత్‌ తరం ప్రపంచ శ్రేణి రవాణా భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది.

ఏపీలో పతంజలి ఫుడ్ పార్క్ 

మరోవైపు సీఎం చంద్రబాబుతో యోగా గురు బాబా రాందేవ్‌ భేటీ కావడం కీలకఘట్టంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్‌ పార్క్‌’పై సీఎంతో ఆయన చర్చించారు. మెగాఫుడ్‌ పార్క్‌ గురించి చంద్రబాబుకు రాందేవ్‌ వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఆహారశుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎంకు తెలిపారు. ఈ పార్క్‌తో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ మెగాఫుడ్‌ పార్క్‌కు 172.84 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle