newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఇక ‘నోటా’నే నొక్కండి

28-12-201828-12-2018 13:57:02 IST
Updated On 28-12-2018 16:54:38 ISTUpdated On 28-12-20182018-12-28T08:27:02.286Z28-12-2018 2018-12-28T08:18:55.429Z - 2018-12-28T11:24:38.519Z - 28-12-2018

ఇక ‘నోటా’నే నొక్కండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని భావిస్తున్న రాయలసీమ వాసులు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలకులు తమను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు ప్రాంతాలకు చెందిన నేతలు రాజకీయాలకు అతీతంగా తమ గొంతు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో వినూత్నంగా తమ నిరసన తెలపనున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఏ పార్టీకి ఓటు వేయవద్దని, నోటాను ఆశ్రయించాలని నేతలు ప్రచారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నాలుగున్నరేళ్ళు పూర్తయింది. విభజన నాటినుంచి రాయలసీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తుతూనే ఉన్నాం. కానీ ఏరాజకీయ పార్టీగానీ, నేత గానీ మా ఆవేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. రాయలసీమను కేవలం ఓటుబ్యాంకు కోసమే వాడుకుంటున్నారు. సమస్యల పరిష్కారం గురించి అడిగితే తాత్సారం చేస్తున్నారు. ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అంశాలను మరుగున పెడుతున్నారు. మేం ఎన్ని పోరాటాలు చేసినా అవి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈసారి వినూత్నమైన ఆందోళనకు దిగుతున్నాం ’’ అంటున్నారు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి. 

రాయలసీమ ప్రాంతంలో తాము ఎనిమిది ప్రధానమయిన సమస్యలను పరిశీలించామని వాటిలో తాగునీరు, సాగునీరు, నిరుద్యోగం ముఖ్యమైనవని బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. వీటిపై వివిధ పార్టీల నేతలకు ఎన్నో వినతిపత్రాలు ఇచ్చామని, అయితే వాటిని నేతలెవరూ పట్టించుకోలేదంటున్నారు. ఎన్నికల సమయంలో తప్ప తమ ప్రాంతం వారికి గుర్తుండడంలేదని, ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల వేళ వినూత్నరీతిలో నిరసన తెలపాలని నిర్ణయించామన్నారు. మంత్రివర్గం ఏర్పాటు, నీటిపారుదల, రాజధాని మొదలైన విషయాలలో రాయలసీమకు రక్షణలు అవసరమన్న భావనను రాయలసీమ నాయకులు వ్యక్తపరచగా, ఈ విషయాలను పరిశీలించేందుకు ఒక సంఘాన్ని నియమించారు. మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌లో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు.అందువల్లే ఒప్పందానికి శ్రీబాగ్ ఒప్పందం అనే పేరు వచ్చింది. వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం సరిగా అమలుకాలేదు. అలాగే రాజధాని, హైకోర్టులు చెరో ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి. ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలని ఉంది. కానీ వాస్తవానికి ఇవేం ఆచరణకు నోచుకోలేదన్నారు. 

1956లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు అందరూ కలిసి మళ్ళీ ‘పెద్దమనుషుల ఒప్పందం’ చేసుకున్నారు.  దీని ప్రకారం రాజధాని కర్నూలులో ఏర్పాటుచేశారని, హైకోర్టు గుంటూరులో ప్రారంభించారు. తర్వాత రాజధానితో పాటు హైకోర్ట్‌ని హైదరాబాద్‌కి తరలించి రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. గతంలో జరిగిన అన్యాయం రాయలసీమకు తిరిగి 2014లోనూ జరిగిందని దశరథరామిరెడ్డి అన్నారు. రాష్ట్రవిభజన అనంతరం ఏపీకి అమరావతి ప్రాంతాన్ని రాజధాని ప్రకటించి కృష్ణా, గోదావరి ప్రాంతాలపై అమిత ప్రేమ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆయన మండిపడ్డారు. తరతరాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతూనే ఉందన్నారు. మళ్ళీ హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్ట్ ని విభజించిన సందర్భంలోనూ రాయలసీమను విస్మరించారు. అమరావతిలో హైకోర్టుని ఏర్పాటుచేయడం తమను వంచించడమే అన్నారు. రాజధాని అమరావతిలో ఉన్నప్పుడు హైకోర్ట్ రాయలసీమలో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్నారు. అలాగే కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌లో రాయలసీమ వాసుల గొంతు వినిపించే అవకాశం లేకుండా చేశారన్నారు. 

అలాగే పోలవరం ప్రాజెక్టు నీటి వినియోగం విషయంలోనూ హామీలు మరిచారన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో నీటివనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తాము వినతిపత్రం ఇచ్చామన్నారు. తమ ప్రాంతానికి కనీసం తాగునీరు అయినా కేటాయించాలని, అదేవిధంగా వ్యవసాయానికి సాగునీరు ఇవ్వాలని కోరామన్నారు. గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్ విషయం ప్రస్తావనకే రాలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంత వాసులు ఏ పార్టీకి ఓటు వేయవద్దని, నోటాను ఎంచుకుని పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరుతున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, పార్టీల కళ్ళ తెరవడానికి ఇలాంటి నిరసన అవసరం అన్నారు. నోటా ఓటు కోసం తాము వివిధ కళాశాలలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్ధినీ విద్యార్ధులను కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2019లో ఏం జరిగినా తమ నోటా ఉద్యమం ఆగదని, 2024 వరకూ కొనసాగిస్తామంటున్నారు దశరథ రామిరెడ్డి. ఇది రాజకీయాలకతీతంగా భవిష్యత్తు తరాల కోసం జరుగుతున్న వినూత్న, విభిన్నమయిన శాంతియుత నిరసన అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle