newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఇక చిన‌బాబుదే కీ రోల్..? మరో కీలక పదవి?

03-07-201903-07-2019 08:22:03 IST
Updated On 03-07-2019 11:51:21 ISTUpdated On 03-07-20192019-07-03T02:52:03.873Z03-07-2019 2019-07-03T02:47:16.371Z - 2019-07-03T06:21:21.845Z - 03-07-2019

ఇక చిన‌బాబుదే కీ రోల్..? మరో కీలక పదవి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మిని చ‌విచూసిన తెలుగుదేశం పార్టీని కాపాడుకోవ‌డానికి చిన‌బాబు నారా లోకేశ్ రంగంలోకి దిగుతున్నార‌న్న ప్ర‌చారం రాజ‌కీయవ‌ర్గాల్లో జ‌రుగుతోంది. గ‌త ఐదేళ్లు ప్ర‌భుత్వంలో కీ రోల్ పోషించిన లోకేశ్ ఇప్పుడు పార్టీని గాడిన పెట్టే బాధ్య‌త‌లు తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేశ్‌కు ఇప్పుడు మ‌రో ప‌ద‌వి కూడా ల‌భిస్తుందంటున్నారు.

త్వ‌ర‌లోనే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్య‌త‌లు తీసుకోనున్నార‌ట‌. చంద్ర‌బాబు వ‌య‌స్సు రీత్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో గ‌ట్టిగా త‌ల‌ప‌డ‌లేర‌ని, జ‌గ‌న్ స‌హా వైసీపీలో యువనేత‌లు కీల‌కంగా ఉన్నందున వారిని చంద్ర‌బాబు కౌంట‌ర్ చేయ‌డం కొంత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు కంటే లోకేశ్ యాక్టీవ్‌గా ఉంటున్నారు.

ప్ర‌తీ రోజు నారా లోకేశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. విత్త‌నాల కొర‌త‌, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌పై ప్ర‌భుత్వాన్ని గట్టిగా విమ‌ర్శిస్తున్నారు. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని ఆధారాల‌తో స‌హా చెబుతూ వైసీపీని ఇరుకున పెడుతున్నారు. ప‌దునైన మాట‌ల‌తో వైసీపీపై, జ‌గన్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారానే విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అయితే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లోకి వెళ్లడం క‌ష్టం.

ఇక‌, చంద్ర‌బాబు త‌ర్వాత తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్ నేత ఎవ‌ర‌నే భ‌యం, ఆందోళ‌న కొంత‌మంది టీడీపీ నేత‌ల్లో అంత‌ర్గ‌తంగా నెల‌కొంది.

దీంతో ఇప్పుడు వారిలో ధీమా క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో నారా లోకేశ్ బ‌య‌ట‌కు రానున్నార‌ని తెలుస్తోంది.త్వ‌ర‌లోనే వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై పార్టీ త‌ర‌పున లోకేశ్ పోరాటాలు చేస్తార‌ని అంటున్నారు. అయితే, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వ‌యంగా ఓడిపోవ‌డం, ప్ర‌సంగించ‌డంలో త‌డ‌బ‌డుతుండ‌టం ఆయ‌న‌కు మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంది.

ఇక‌, పార్టీలో మ‌రో ప‌ద‌వి కూడా త్వ‌ర‌లో ఖాళీ కానుంద‌ని ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిమిడి క‌ళావెంక‌ట్రావు ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయ‌న పార్టీ వ్య‌వహారాల్లో పెద్ద‌గా యాక్టివ్‌గా లేకున్నా న‌డిచింది. ఇప్పుడు ఆయ‌న స్వ‌యంగా ఓడిపోవ‌డం, పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో ఆయ‌న కూడా యాక్టీవ్‌గా ఉండాల్సిన అవ‌స‌రాన్ని పార్టీ గుర్తించింది.

అయితే, ఆయ‌న లేఖ‌లు రాయ‌డం మిన‌హా పెద్ద‌గా ఎప్పుడూ మీడియా ముందుకొచ్చి వైసీపీని విమ‌ర్శించిన దాఖ‌లాలు లేవు. ఇప్పుడు ఆయ‌న ప‌ద‌విలోనూ కొత్త నేత‌కు అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం ఉంది. ఈ ప‌ద‌వి కోసం యువ‌నేత, శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహ‌న్‌నాయుడు పేరును చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఆయ‌న తండ్రి ఎర్ర‌న్నాయుడు గ‌తంలో టీడీపీలో నెంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రించారు.

పార్టీకి కింజార‌పు కుటుంబం ఆదినుంచీ విధేయంగా ఉంటోంది. దీనికి తోడు మొన్నటి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలో ఈ కుటుంబం నుంచి ముగ్గురు విజ‌యం సాధించి ప‌ట్టు నిలుపుకున్నారు. దీంతో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా రామ్మోహ‌న్‌నాయుడుకు అవ‌కాశం రావొచ్చ‌నే ప్ర‌చారం ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle