newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

ఇక గ్రామ సచివాలయాల్లోనూ రివర్స్ టెండరింగ్

26-10-201926-10-2019 15:18:51 IST
Updated On 26-10-2019 17:42:42 ISTUpdated On 26-10-20192019-10-26T09:48:51.816Z26-10-2019 2019-10-26T09:48:40.733Z - 2019-10-26T12:12:42.582Z - 26-10-2019

ఇక గ్రామ సచివాలయాల్లోనూ రివర్స్ టెండరింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రివర్స్ టెండరింగ్ అనే భావనను ఏ క్షణంలో వైస్ జగన్మోహన్ రెడ్డి కనిపెట్టారో కానీ ఆంద్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క విభాగం ఈ ప్రక్రియకు లోనుకాక తప్పదనిపిస్తోంది. ఇంతవరకు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల్లో, గృహనిర్మాణ పథకాల్లో రివర్స్ టెండరింగ్‌ను అమలుచేసిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1500 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ఘనంగా చెప్పుకుంటూ వస్తోంది. 

అయితే రివర్స్ టెండరింగ్ విధానంపై సానుకూలత ఏ మేరకు ఉందో ప్రతికూలత కూడా అదే స్థాయిలో ఉందన్నది వేరేవిషయం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతోపాటు, జనసేన వంటి చిన్నా చితకా పార్టీలు కూడా రివర్స్ టెండరింగ్ విధానంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని విభాగం తర్వాత విభాగంలో అమలు చేయడానికే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా శుక్రవారం జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లోనూ రివర్స్ టెండరింగ్ కి వెళ్లింది. గ్రామ సచివాలయాలకు అవసరమైన డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్ సిస్టమ్స్ వంటి వాటి కొనుగోలుపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన ప్రభుత్వం రూ. 65.47 కోట్లవరకు ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ప్రకటించింది.

డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలులో రివర్స్ టెండరింగుకు పిలవడం ద్వారా రూ. 51.15 కోట్లను, ప్రింటర్ల కొనుగోలు ద్వారా మరో 14.32 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 

గ్రామ సచివాలయాలకోసం ప్రభుత్వం 29,888 కంప్యూటర్లు, 19,944 యూపీఎస్‌ల కొనుగోలుకు గతంలో టెండర్లను  పిలిచింది. మూడు కంపెలనీలు టెండర్లు వేయగా ఒక కంపెనీ రూ. 191.10 కోట్లతో అతితక్కువ దరకు కోట్ చేసి ఆర్డర్లను దక్కించుకుంది.

అయితే ఆ కంపెనీ కోట్ చేసిన మొత్తం ఇంకా అధికంగానే ఉందని భావించిన ప్రభుత్వం కంప్యూటర్ల కొనుగోలుపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. దీంతో మరొక కంపెనీ రూ. 139.95 కోట్లకు కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. గతంలో ఎల్-1 వేసిన టెండర్ విలువ కంటే 26.77 శాతం తక్కువకు కోట్ చేసిన కంపెనీ తాజాగా ప్రభుత్వానికి రూ. 51.15 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినట్లయింది

రాష్ట్రంలోని ప్రతిపక్షాలూ, చివరకు కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా రివర్స్ ట్రెండింగ్‌పై అనుమానాలు, సందేహాలు రేకెత్తిస్తున్నప్పటికీ, జగన్ ప్రభుత్వం మాత్రం పట్టిన పట్టు వదలకుండా అన్ని విభాగాల్లో జరిగిన పాత కాంట్రాక్టులపై రివర్స్ టెండరింగ్ కు దారితీస్తూ వెళుతోంది.

ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది భవిష్యత్తు తేల్చవలసిన ప్రశ్నే కానీ ప్రాజెక్టులు, తదితర కాంట్రాక్టు పనుల నిలిపివేత వల్ల జాప్యం వల్ల ప్రభుత్వానికి, రాష్ట్రానికి కలిగే నష్టం ఎంత అనేది తేలాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle