newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఇక గంటా గణగణలే...

14-03-201914-03-2019 07:13:43 IST
2019-03-14T01:43:43.876Z14-03-2019 2019-03-14T01:43:40.454Z - - 20-09-2019

ఇక గంటా గణగణలే...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంత్రి గంటా శ్రీనివాసరావుకు క్లారిటీ వచ్చేసిందట. ఇన్నాళ్లూ పడ్డ టెన్షన్ మబ్బులా వీడిపోయిందట. నిన్నటి దాకా భీమిలి సీటు నుంచి లోకేష్ పోటీ చేస్తారనీ, తాను విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాల్సి వస్తుందన్న వార్తలతో టెన్షన్ పడ్డ గంటా... ఇప్పుడు లోకేష్ సీటు మీద క్లారిటీ రావడంతో మనసు కుదుట పడినట్లు తెలుస్తోంది. విశాఖ ఎంపీ సీటు నుంచి ఎంవీవీఎస్ భరత్ పోటీ చేస్తారని కూడా తేలడంతో గంటా టోటల్ ఫ్రీ అయినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఇక భీమిలి సీటు తనదేనని అర్థం చేసుకున్న గంటా శ్రీనివాసరావు... కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారని సమాచారం. అయితే ఇప్పుడు గంటా ముందు చాలా సవాళ్లు ఉన్నాయని టీడీపీ నేతలే చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తోందనీ... చాలా కాలంగా ఈ కుట్ర జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు గంటా అనుచరులు.

అంతేకాదు... భూముల కుంభకోణం కూడా ఇప్పుడు గంటా శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టడం ఖాయమని భయపడుతున్నారు. అయితే భీమిలి నియోజకవర్గంలో తమను ఎదుర్కొనేంత బలం వైసీపీకి లేదంటున్న గంటా అనుచరులు... జనసేన పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బరిలో దిగితే మాత్రం గంటా శ్రీనివాసరావుకు కొంచెం ఇబ్బందేనని అంచనా వేస్తున్నారు. ఇంతకీ జనసేన నుంచి పోటీచేసేది ఎవరని తేలితే గంటా తన వ్యూహాలకు పదునుపెడతారని అంటున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle