newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

ఇక ఇంటర్వ్యూల చింతలేదు.. రాతపరీక్షలే కొలమానం

18-10-201918-10-2019 08:29:17 IST
Updated On 18-10-2019 15:02:55 ISTUpdated On 18-10-20192019-10-18T02:59:17.212Z18-10-2019 2019-10-18T02:59:10.855Z - 2019-10-18T09:32:55.548Z - 18-10-2019

 ఇక ఇంటర్వ్యూల చింతలేదు.. రాతపరీక్షలే కొలమానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంత ప్రతిభ ఉన్నా...ర్యాంకుల పంట పండించినా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో ఘన విజయం సాధించినా ఇంటర్వ్యూ ప్రక్రియలో అభ్యర్ధులు విజయం సాధించలేకపోతున్నారు. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల తమ చిరకాలవాంఛ నెరవేరడం లేదని బాధపడుతుంటారు. అలాంటివారికి ఏపీ ప్రభుత్వం చల్లని కబురు అందించింది. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ పర్వం లేకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన టైమ్ టేబుల్ ప్రకారం ఉద్యోగ నియమకాలు జరిగేలా ఏపీపీఎస్‌సీ నిబంధనలను సవరించాలని నిర్ణయించారు. అమరావతిలో ఏపీపీఎస్‌సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

అత్యంత పారదర్శక విధానంలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ఏపీపీఎస్‌సీ అధికారులను ఆదేశించారు.రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. 

ప్రతీ జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ విడుదల చేయాలని, యుపిఎస్‌సీ తరహాలో నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగాల భర్తీ పూర్తికావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీపీఎస్‌సీ నిర్వహించే ప్రతీ పరీక్షలో ఐఐటి, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు.

ఏపీపీఎస్‌సీ జారీ చేసే ప్రతీ నోటిఫికేషన్ కోర్టు కేసుల్లో ఇరుక్కుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇకపై అలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని, అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాలలో యుద్దప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం, భాగస్వామ్యాలను తీసుకోవడంపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను తయారు చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్‌ కేటాయింపులు తదితర ప్రతిపాదనలతో నవంబర్‌ నెలాఖరులోగా ముఖ్యమంత్రితో అధికారులు మరోసారి సమావేశం కానున్నారు. జగన్ నిర్ణయం పట్ల నిరుద్యోగ యువత హర్షం చేస్తున్నారు. 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle