newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఇక ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టం.. లూలూ గ్రూప్ ప్రతిజ్ఞ

21-11-201921-11-2019 15:09:03 IST
2019-11-21T09:39:03.641Z21-11-2019 2019-11-21T09:39:00.860Z - - 15-12-2019

ఇక ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టం.. లూలూ గ్రూప్ ప్రతిజ్ఞ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై తాము ఎలాంటి పెట్టుబడులూ పెట్టబోమని ప్రముఖ పారిశ్రామిక సంస్థ ది లూలూ గ్రూప్ పేర్కొంది. విశాఖపట్నంలో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన యూఓఈ కేంద్రంగా పనిచేసే లూలూ గ్రూప్ వైకాపా ప్రభుత్వ తీరుతో ఈ కఠిన నిర్ణయానికి వచ్చింది.

గతంలో టీడీపీ ప్రభుత్వం తన ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూ కేటాయింపులను వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రూప్ ఆశలు ఆవిరైపోయాయి. తనకు కేటాయించిన భూములను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన నెలలోపే లూలూ గ్రూపు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. విశాఖలో అంతర్జాతీయ షాపింగ్ మాల్, కన్వెన్షన్ హాల్‌ని 13.83 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడానికి లూలూ గ్రూప్ ముందుకొచ్చింది. 

లూలూ గ్రూప్ ఇండియా డైరెక్టర్ అనంత్ రామ్ ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ కేంద్రంగా పనిచేస్తున్న మా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి రూ. 2,200 కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించింది. విశాఖకు అంతర్జాతీయ చిత్రపటంలో ఈ నిర్మాణాలతో ప్రముఖ స్థానం కల్పించాలన్నదే మా లక్ష్యం. ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తయితే 7 వేలమందికి పైకా యువతకు ఉద్యోగాలు లభించగలవని అంచనా కూడా వేశాం. కానీ గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపై కుంభకోణం జరిగిందని వైకాపా ప్రభుత్వం అనుమానించింది. మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయల వరకు ఉండగా టీడీపీ ప్రభుత్వం ఎకరాకు 4 లక్షల రూపాయలకే భూమి కేటాయించడం వివాదాలకు దారితీసింది.

అత్యంత పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో మేం పాల్గొన్నాం. ఈ ప్రాజెక్టుకోసం లీజు కింద భూమిని మాకు కేటాయించారు. ప్రాజెక్టు అభివృద్ది ఖర్చుల కింద ఇప్పటికే భారీ మొత్తం ఖర్చు పెట్టాం. అంతర్జాతీయంగా పేరొందిన కన్‌స్టల్టెంట్లన నియమించాం. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌లతో ప్రాజెక్టు డిజైన్ చేశాం. కానీ మారిన పరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి తలొగ్గటం తప్ప వేరే దారి లేదు. అందుకే భవిష్యత్తులో కూడా ఏపీలో మరే కొత్త ప్రాజెక్టుల్లోను పెట్టుబడులు పెట్టబోమని అనంత్ ప్రకటనలో తెలిపారు.

అయితే అదేసమయంలో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో మేం ప్రారంభించబోతున్న కొత్త ప్రాజెక్టులను కొనసాగిస్తామని లూలూ గ్రూప్ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 2,200 కోట్ల ప్రాజెక్టుకోసం లూలూ గ్రూప్ విశాఖలో శంకుస్థాపన చేసింది. ప్రత్యక్షంగా 5 వేలమందికి పరోక్షంగా మరో 5 వేలమందికి ఈ ప్రాజెక్టులో ఉపాధి కల్పిస్తామని సంస్థ పేర్కొంది.

అయితే 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలకు మంగళం పాడేసింది. టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో అవినీతికి తలుపులు తెరిచిందని, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిందని వైకాపా ప్రభుత్వం ఆరోపించింది. దీంతో పలు కంపెనీలు, మదుపుదారుల్లో భయాందోళనలు పెరిగాయి. 

ఒక భారీ స్థాయి నిర్మాణ సంస్థ ముందే ప్రకటించిన భారీ ప్రాజెక్టునుంచి వైదొలగడం అంటే అంది ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుందో వైకాపా ప్రభుత్వానికి అర్థం కాలేదేమో..

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle