newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఇక‌ వైఎస్సార్ నామ ప్ర‌భుత్వం..!

01-06-201901-06-2019 09:53:11 IST
Updated On 25-06-2019 12:39:02 ISTUpdated On 25-06-20192019-06-01T04:23:11.028Z01-06-2019 2019-06-01T04:23:02.803Z - 2019-06-25T07:09:02.880Z - 25-06-2019

ఇక‌ వైఎస్సార్ నామ ప్ర‌భుత్వం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ని ప్రారంభించారు. అధికారుల‌తో స‌మావేశ‌మ‌వుతూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు మ‌నుషులుగా ముద్ర‌ప‌డి ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఉన్న కీల‌క అధికారుల‌ను బ‌దిలీ చేశారు. మ‌రికొంత మందిని బ‌దిలీ చేసే యోచ‌న‌లో ఉన్నారు. కొత్త డీజీపీని నియ‌మించారు.

ఇక‌, ప‌థ‌కాల‌కు సంబంధించి సైతం అధికారుల‌తో స‌మీక్షలు జ‌రుపుతూ జ‌గ‌న్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రేప‌టి నుంచి వారం రోజుల పాటు ఆయ‌న వ‌రుస‌గా వివిధ శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు జ‌ర‌ప‌నున్నారు. అయితే, ప‌థకాల‌ను రీబ్రాండ్ చేయాల‌నే భావ‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న రెండు నిర్ణ‌యాల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వంలో పింఛ‌న్ల ప‌థ‌కానికి ఉన్న ఎన్టీఆర్ భ‌రోసా ప‌థ‌కాన్ని వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ మేర‌కు పింఛ‌ను సొమ్మును పెంచ‌డంతో పాటు వృద్ధాప్య పింఛ‌న్ అర్హ‌త వ‌య‌స్సును జ‌గ‌న్ త‌గ్గించారు.

ఇక‌, విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం భోజ‌నం అందించే అక్ష‌య పాత్ర ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మైన జ‌గ‌న్ మ‌ధ్యాహ్న భోజ‌నం విష‌యంలో రాజీ వ‌ద్ద‌ని, విద్యార్థుల‌కు మంచి పౌష్టికాహారం అందించాల‌ని సూచించారు. దీంతో పాటు ఆయ‌న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి వైఎస్సార్ అక్ష‌య‌పాత్ర‌గా నామ‌క‌ర‌ణం చేశారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా మేనిఫెస్టోలో పెట్టిన న‌వ‌ర‌త్నాల్లోనూ ప‌లు ప‌థ‌కాల‌కు వైఎస్సార్ పేరు ఉండ‌నుంది. వైఎస్సార్ రైతు భ‌రోసా, వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ, వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ జ‌ల‌య‌జ్ఞం వంటి ప‌థ‌కాలు న‌వ‌ర‌త్నాల్లో ఉండ‌నున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు జీవ‌నాడిగా ఉండ‌నున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు సైతం వైఎస్సార్ పేరు పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

వైఎస్సార్ హ‌యాంలోనే పోల‌వ‌రం ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఆయ‌నే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేయ‌డంతో పాటు ఆయ‌న జీవించి ఉన్న‌ప్పుడు ప‌నులు వేగంగా జ‌రిపారు. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాల‌ని అవంతి శ్రీనివాస‌రావు వంటి వైసీపీ నేత‌లు డిమాండ్ ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు. దీంతో పోల‌వ‌రం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

గ‌త ఐదేళ్లుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ అంత‌కుముందు ఉన్న పేర్లు మార్చి చంద్ర‌న్న‌, ఎన్టీఆర్ పేర్ల‌తో బ్రాండ్ చేసుకున్నారు. ఇప్పుడు సైతం జ‌గ‌న్ ఇవా ప‌థ‌కాల‌లో కొన్ని మార్పులు తెచ్చి వైఎస్సార్ పేర్లు పెట్టేయ‌నున్నారు. కొత్త ప‌థ‌కాల‌కు అయితే ఎలాగూ వైఎస్ పేరు పెట్ట‌డం ఖాయ‌మే.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle