newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఇక్క‌డ సామాజిక న్యాయం మ‌రిచారేమి..?

21-10-201921-10-2019 08:51:18 IST
Updated On 21-10-2019 16:07:27 ISTUpdated On 21-10-20192019-10-21T03:21:18.856Z21-10-2019 2019-10-21T03:19:52.963Z - 2019-10-21T10:37:27.387Z - 21-10-2019

ఇక్క‌డ సామాజిక న్యాయం మ‌రిచారేమి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు. మంత్రివ‌ర్గ ఏర్పాటు నుంచే ఆయ‌న ఇది నిరూపించుకున్నారు. ఎక్కువ మంత్రి ప‌ద‌వుల‌తో పాటు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల‌ను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు క‌ట్ట‌బెట్టి సంచ‌ల‌నం సృష్టించారు.

మ‌హిళ‌ల‌కు సైతం మంత్రి ప‌ద‌వుల విష‌యంలో ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చారు. కీల‌క‌మైన హోంశాఖ‌తో పాటు ఒక ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని మ‌హిళ‌ల‌కు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

జ‌గ‌న్ మంత్రివ‌ర్గ ఏర్పాటుపై అప్పుడు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఇక‌, త‌ర్వాత కూడా నామినేటెడ్ ప‌ద‌వుల్లో, నామినేష‌న్ వ‌ర్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ జ‌గ‌న్ అసెంబ్లీలో చ‌ట్టాలు చేశారు.

దీనిపైనా జ‌గ‌న్‌ను ఆయా వ‌ర్గాలు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నాయి. బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షులు ఆర్‌.కృష్ణ‌య్య అయితే జ‌గ‌న్‌ను బీసీలు దైవంలా కొల‌వాల‌ని, జ‌గ‌న్ బీసీల ఆశాజ్యోతి అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు.

అయితే, జిల్లాల ఇంఛార్జి మంత్రుల ఎంపిక విష‌యంలో మాత్రం జ‌గ‌న్ సామాజిక న్యాయాన్ని ప‌క్క‌న‌పెట్టారు. నాలుగు నెల‌ల‌కే ఇంఛార్జి మంత్రుల‌ను మార్చిన ఆయ‌న ఒక్క మేక‌పాటి గౌతం రెడ్డిని మిన‌హా అంద‌రినీ ప్ర‌స్తుత జిల్లాల నుంచి మార్చారు. కొంద‌రికి అయితే మొత్తానికే స్థానం ద‌క్క‌లేదు. కాగా, ఒక్క మ‌హిళా మంత్రికి కూడా ఇంఛార్జి మంత్రిగా అవ‌కాశం ల‌భించ‌లేదు. ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రుల్లోనూ ఒక్క‌రు ఇంఛార్జి మంత్రులు అవ్వ‌లేదు.

ఇంత‌కుముందు ఉప ముఖ్య‌మంత్రులు ఆళ్ల నాని తూర్ప‌గోదావ‌రి జిల్లాకు, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ఇంఛార్జి మంత్రులుగా ఉండే వారు.

ఇప్పుడు వీరిద్ద‌రికీ అవ‌కాశం ద‌క్క‌లేదు. మ‌హిళా మంత్రి మేక‌తోటి సుచ‌రిత నెల్లూరు జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు ఆమెను కూడా త‌ప్పించారు. ఆమె స్థానంలో ఏ మ‌హిళా మంత్రికి కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఇక‌, క్యాబినెట్‌లో ఉన్న న‌లుగురు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన మంత్రుల‌కూ ఇంఛార్జి మంత్రులుగా అవ‌కాశం ల‌భించింది. కొత్త‌గా కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూల‌పు సురేశ్‌కు ఇంఛార్జి మంత్రులుగా అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్‌.

ఇప్ప‌టికే కీల‌క ప‌ద‌వుల‌ను జ‌గ‌న్ అగ్ర‌వ‌ర్ణాల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని టీడీపీ విమ‌ర్శిస్తోంది. ఇప్పుడు ఇంఛార్జి మంత్రుల విష‌యంలో జ‌గ‌న్ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు టీడీపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌యింది.

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle