newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఇకనుంచి ప్రభుత్వ అధ్వర్యంలోనే మద్యం దుకాణాలు..

21-09-201921-09-2019 17:41:44 IST
2019-09-21T12:11:44.513Z21-09-2019 2019-09-21T12:11:42.750Z - - 20-11-2019

ఇకనుంచి ప్రభుత్వ అధ్వర్యంలోనే మద్యం దుకాణాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో 30 సంవత్సరాల చరిత్రకు మంగళం పాడుతూ మద్యం దుకాణాలను ప్రభుత్వమే పరిమిత ప్రాంతాల్లో నిర్వహించడం త్వరలో ప్రారంభమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో బెల్టు షాపులు గ్రామగ్రామానా తెరిచి సామాన్య ప్రజల ఆదాయాన్ని, కుటుంబాల మనుగడను ధ్వంసం చేసిపడేసి దారుణ అనుభవాలను మళ్లీ అనుమతించకూడదనే సదాశయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే బెల్టు షాపుల మూసివేతకు ఆదేశాలిచ్చింది. 

మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే పేదవాడి కళ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమని ఎన్నికల ప్రచారంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విధంగానే అక్టోబరు 1వ తేదీ నుంచి విచ్చలవిడి మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా తొలి ఏడాదే 20 శాతం మద్యం దుకాణాలకు చరమగీతం పాడుతూ నిర్ణయం తీసుకున్నారు. 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం ఆదాయ వనరుగా కొనసాగింది. లోటు బడ్జెట్లో ఉన్నామంటూ మద్యం విక్రయాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్‌రూమును కేటాయించి ఒక్కో రూముకు రూ.5 లక్షల ఫీజు వసూలు చేశారు. ఇక బెల్టుషాపుల జోరు చెప్పనక్కరలేదు.

పల్లెపల్లెలో బెల్టుషాపుల హవా నడిచిందనే విమర్శలు వినిపించాయి. ఉదాహరణకు 2015–16 ఆర్థిక సంవత్సరానికి తరువాతి సంవత్సరానికే దాదాపు నాలుగు రెట్ల ఆదాయం అధికంగా వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా 2016–17కంటే 2017–18లో రూ.182 కోట్లు అదనంగా రాగా, 2018–19లో గత ఏడాదికంటే రూ.191.50 కోట్లు అదనంగా లభించింది. 

ఈ విధంగా ప్రతి ఏటా అదనపు ఆదాయం కోసం వెంపర్లాడడమే తప్ప ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదున్నర నెలల కాలానికి రూ.558.29 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గత ఏడాది లభించిన వార్షిక ఆదాయాన్ని ఈ ఏడాది చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతే తప్ప అదనపు ఆదాయం వచ్చే సూచనలు మాత్రం లేవని స్పష్టం అవుతోంది. 

కానీ బెల్టు షాపులను మూసివేసినా కొత్త బడ్జెట్లో మద్యం ద్వార ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం 20వేల కోట్లకు పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం వేసిన అంచనా విమర్శల పాలవుతోంది. ప్రభుత్వమే లిక్కర్ దుకాణాలు తెలిచి అమ్మకాలు జిరిపినా ఇంత బారీగా మద్యద్వారా ఆదాయం ఎలా వస్తుందనేది ప్రశ్నగానే మిగులుతోంది. అక్టోబర్ మొదటి నుంచి ప్రారంభమయ్యే కొత్త విధానం పేద ప్రజల జీవితాలను హరింపజేసేలా కాకుండా ముఖ్యంగా సామాన్యులు కుటుంబాల్లోని మహిళలు, పిల్లలకు సంతోషాన్ని కలిగించేలా అమలు కావాలని ఆశిద్దాం. 

మద్యదుకాణాల నిర్వహణ కంటే, మద్యం ఆదాయం పెంపు కంటే మించి ప్రజల సంతోషమే పునాదిగా ప్రభుత్వం నూతన విధానాన్ని లోపరహితంగా అమలు చేయాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle