newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

ఇంతకీ ఆయనెవరు? జనంలో అయోమయం!

21-11-201921-11-2019 13:27:04 IST
Updated On 21-11-2019 17:04:13 ISTUpdated On 21-11-20192019-11-21T07:57:04.376Z21-11-2019 2019-11-21T07:56:15.083Z - 2019-11-21T11:34:13.184Z - 21-11-2019

ఇంతకీ ఆయనెవరు? జనంలో అయోమయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మతమేంటి? అయన హిందువా? లేక క్రైస్తవుడా?. రాష్ట్రంలో పేద ప్రజలే టార్గెట్ గా నవరత్నాలను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతుంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలు ఎందుకంటారా? ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం తీసుకొచ్చిన తెలుగు మీడియం రద్దు జీవోల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇదంతా ఆయన క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేసేందుకే అని విమర్శలు చేస్తుండడంతో ఈ సందేహాలు మెదడును తొలిచేస్తున్నాయి. 

ఈమధ్యనే జగన్ ప్రభుత్వంలోని మంత్రిగా ఉన్న కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సీఎం మతం మీద మరోసారి చర్చ రేపాయి. కొడాలి నానీ మాజీ సీఎం చంద్రబాబు మీద ఉగ్రుడై దూషణలకు దిగారు. ఆ వ్యాఖ్యలలో సీఎం జగన్ తిరుమలకి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలా? తిరుపతి ఏమైనా నీ యమ్మ మొగుడు కట్టించాడా అంటూ బాధ్యత గల పదవులలో ఉండే వ్యక్తులెవరూ చేయని వ్యాఖ్యలు చేశారు.

దీనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతుండగా బీజేపీ నేతలైతే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఇక్కడ తిట్టింది చంద్రబాబునే అయినా ఆయనకు తెలియకుండానే తేనెతుట్టెని కదిలించారు. ఎందుకంటే ఎంతగొప్ప స్థాయిలో ఉన్న అన్యమతస్థుడైనా తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. శ్రీవారిపై, హిందూ సంప్రదాయంపై తమకు నమ్మకం ఉందని దాని సారాంశం.

దేశ ప్రథమ స్థానమైన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో అబ్దుల్ కలాం, దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్న కాలంలోనే ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా డిక్లరేషన్ ఇచ్చే దైవ దర్శనానికి వెళ్లారు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారు. సీఎం అయ్యాక మాత్రం డిక్లరేషన్ అడిగే ధైర్యం ఎవరూ చేయలేదో.. ఆయనే ఇవ్వలేదో కానీ దర్శనం జరిగిపోయింది.

నిజానికి సీఎం జగన్ కుటుంబమంతా క్రైస్తవులే. అయన తాత రాజారెడ్డే ఆ మతాన్ని స్వీకరించగా అందరూ అందుకు కట్టుబడి ఉన్నారు. జగన్ తల్లి విజయమ్మ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా ఆమె చేతిలోనే బైబిల్ ఉంటుంది. ఆ గ్రంథం చేతిలో ఉంటే తనకు ఎంతో ధైర్యం అని చెప్పుకొచ్చారు కూడా. జగన్ సీఎం అయ్యాక కూడా క్రైస్తవుల పవిత్ర స్థలం జెరూసలేంకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

అయితే గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా హిందూ దేవుళ్లు, హిందూ కార్యకలాపాలపై దృష్టి సారించారు. అప్పుడు సీఎం కెసిఆర్ తో స్నేహం, శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామితో అనుబంధం, హోమాలు, యాగాలు చేసి అయన హిందూ మతాన్ని కూడా పాటిస్తారనేలా కనిపించింది. ఆయన జన్మతః క్రైస్తవుడేనని చెప్పుకోవాలి.. కనుక ఆయన హిందూ మతాన్ని స్వీకరించారా? అంటే పలకరు.

జగన్ పెద్దఎత్తున హిందూ మతానికి చెందిన కార్యక్రమాలలో పాల్గొనేప్పుడు ఓ చర్చి ఫాదర్ ఆయన్ను మతం మీద ప్రశ్నించారు కూడా. కానీ ఆయన నవ్వే సమాధానం. నిజానికి జగన్ మతం కూడా ఆయన రాజకీయంగా కొంత అడ్వాంటేజ్ కలిసి వస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. అందుకే ఆయన సూటిగా సమాధానం చెప్పరు. ఆయన అన్ని మతాలను పాటించడం.. ఆచరించడం మంచి విషయమే.

కానీ మతాలను అగౌరవపరిచేలా ప్రవర్తించడం మనోభావాలకు సంబంధించిన విషయం. టీటీడీలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలన్నది కూడా హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. సీఎం తానూ హిందువుగా ప్రకటిస్తే ఏ గోలా ఉండదు. కానీ సమాధానం లేకుండా తిరుపతి మీ తాత కట్టించారా అన్న వ్యాఖ్యలే ఇప్పుడు ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు మంచి పద్ధతి అన్నది ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   an hour ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   an hour ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   an hour ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   2 hours ago


బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

   2 hours ago


సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

   2 hours ago


నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

   5 hours ago


దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

   6 hours ago


లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

   6 hours ago


మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

   7 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle