newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

‘ఇంటెరిమ్’ షాక్‌లో మరో ట్విస్ట్.. ఏపీ ఎన్జీవోల చెప్పుకోలేని బాధ

09-07-201909-07-2019 12:57:48 IST
Updated On 10-07-2019 11:57:57 ISTUpdated On 10-07-20192019-07-09T07:27:48.991Z09-07-2019 2019-07-09T07:27:47.165Z - 2019-07-10T06:27:57.535Z - 10-07-2019

‘ఇంటెరిమ్’ షాక్‌లో మరో ట్విస్ట్.. ఏపీ ఎన్జీవోల చెప్పుకోలేని బాధ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోరి తెచ్చుకున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తమకు రావాల్సిన మూడు మాసాల ఇంటెరిమ్ రిలీఫ్ ఎగ్గొట్టి ఒక్కొక్కరికీ రూ.30 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టం కలిగించిందని వాపోతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా మరో ‘షాకింగ్ న్యూస్’ తెలుసుకుని బెంగపడిపోతున్నారు. ఇంటెరిమ్ ప్రకటించారన్న సంతోషం ఉద్యోగుల్లో ఎక్కడా కనిపించడం లేదు. దిగాలు ముఖాలతో విధులకు హాజరవుతున్నారు. జీవో లోతుగా పరిశీలించక మరో కొత్త కోణం బయటపడటంతో మరింత ఆందోళనతో ఉన్నారు.

నోటి దగ్గరకు అందిన 3 నెలల మధ్యంతర భృతిని ప్రస్తుత ప్రభుత్వం లాగేసుకుందనే బాధ ఒకవైపు తొలిచేస్తుంటే, కొత్త జీవో వల్ల 11వ పీఆర్‌సీ అమలు తేదీలో ఒక సంవత్సరం నష్టపోతామని తెలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరింత కలవరపడుతున్నారు. వచ్చీ రాగానే కొత్త ప్రభుత్వం ఇలా తమ పొట్టకొట్టడాన్ని వారంతా జీర్ణించుకోలేక పోతున్నారు. వివరాలలోకి వెళితే.. గత ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ 21లో 20శాతం ఇంటెరిమ్ రిలీఫ్ ది 1.7.2018 నుంచి నోషనల్‌గా, ది.1.4.2019 నుంచి నగదుగా ఇస్తున్నట్టు స్పష్టంగా ఉంది. దీని వల్ల 11 వ పీఆర్‌సీ ఆర్థిక ప్రయోజనాలు జులై 1వ తేదీ నుంచి అమలవ్వడమే కాకుండా అదే తేదీ  నుంచి నోషనల్ ప్రయోజనాలు లభించేవి. 

అంతేగాక, ఏప్రిల్ 1 నుంచి నగదు రూపంలో కూడా పెద్ద మొత్తం ఉద్యోగులకు దక్కేది. 1-7. 2018-31.3.2019 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ‌ చేసిన వారికి కూడా ఈ ప్రయోజనం ఉండేది. అలాగే, జరగబోయే 11 వ పీఆర్‌సీ చర్ఛలలో ది.1.7.2018ని అమలు తేదీగా అడిగే హక్కు ఉద్యోగులకు దక్కేది. సాధారణంగా మధ్యంతర భృతి ఇచ్చిన తేదీనే పీఆర్‌సీ అమలు తేదీగా పరిగిణించే సంప్రదాయం ఎన్నో యేళ్ళ నుంచి  కొనసాగుతూ  వస్తోంది. కొత్త ప్రభుత్వం జీవో నెంబర్ 60 ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 21ని పూర్తిగా రద్దు (సప్రెషన్) చేసింది. కొత్తగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో తేదీ 1.7.2018 నుంచి నోషనల్‌గా అనే ప్రస్తావన  లేకుండా  ది.1.7.2019 నుంచి 27శాతం నగదుగా అని పేర్కొంది. 

ఈ జీవో వల్ల రెండు విధాలుగా నష్టపోయామనే‌ బాధ ‌ఉద్యోగులలో కనిపిస్తోంది. ఏప్రిల్ ఫస్టు నుంచి జూన్ వరకు రావాల్సన 20శాతం మధ్యంతర భృతిని కోల్పోవడమే కాకుండా 11వ పీఆర్‌సీ అమలు తేదీలో కూడా ఒక సంవత్సరం నష్టపోకతప్పదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. జీవోలో అంశాల్ని లోతుగా చర్చించి విషయం అర్ధం చేసుకున్న ఎన్జీవో నేతలు అందువల్లనే 27శాతం ఐఆర్ ఉత్తర్వుల పట్ల హర్షం ప్రకటించలేదు. పాత ప్రభుత్వం జారీచేసిన ‘ఉత్తర్వుల రద్దు పర్వం’లో తాము కష్టపడి సాధించుకున్న 20శాతం ఐఆర్ జీవో కూడా ఉంటుందని అస్సలు ఊహించని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు తోటి ఉద్యోగులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. 

ఏప్రిల్ నుంచి రావాల్సిన 20శాతం మథ్యంతర భృతి కోసం ఇప్పటికే బిల్లులు కూడా సమర్పించారు. కొత్త జీవోతో అవన్నీ రేపోమాపో తిరుగు టపాలో వెనక్కి వచ్చేస్తాయి. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక నాయకులు కుమిలి పోతున్నారు. ఎన్నో ఆశలు పెంచుకొని అధికార పార్టీ గెలుపులో ప్రధాన భూమిక  వహించిన ఉద్యోగుల ఆర్థిక లాభానికే కోత కోసి తీవ్ర అన్యాయం చేశారనే‌ భావన వారిలో ఉంది. ఈ అసంతృప్తి దీర్ఘ కాలం ప్రభుత్వంపై ఉంటుందని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు.

ఇదే అంశంపై ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధి ఉద్యోగ సంఘానికి చెందిన ఒక నాయకుడిని సంప్రదించినప్పుడు ‘ఐఆర్ ఉత్తర్వులపై తమ ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంద’ని అభిప్రాయపడ్డారు. ‘త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమ పరిస్థితిని వివరిస్తా’మని చెప్పారు. ముఖ్యంగా కొన్ని డిమాండ్లు సీయం ముందు పెట్టబోతున్నట్టు వెల్లడించారు. 

గత ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం తాత్కాలిక భృతిని జులై నుంచి 27 శాతానికి పెంచుతున్నామని, పాత 20 శాతం ఐఆర్‌ను జులై నుంచి 31.3.2019 వరకు నోషనల్‌గా ఇస్తామని, ఏప్రిల్ నుంచి రావాల్సిన ఐఆర్‌ను పీఆర్‌సీ లాభాలతో చెల్లిస్తామని పేర్కొంటూ జీవో 60కు సవరణ ఇవ్వాలన్నది ఉద్యోగ సంఘాల తాజా డిమాండ్ గా ఉంది.

1.4.2019 నుంచి 30.6.2019 వరకు రావాల్సిన IR  లాభాన్ని 11 వ పీఆర్‌సీ ప్రయోజనాలతో పాటు చెల్లిస్తామని ఇదే జీవోలో పేర్కొంటూ సవరణ చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరనున్నారు. అలా వీలుకాని పక్షంలో ఈ మూడు మాసాల 20శాతం ఇంటెరిమ్ ప్రయోజనాల్ని వచ్చే ఆర్ధిక‌ సంవత్సరంలో 3 వాయిదాలలో పీఎఫ్‌కు జమ చేస్తామనైనా పేర్కొంటూ తక్షణం ఆదేశాలు ఇవ్వాలని అడగబోతున్నారు. 

మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఉభయ భ్రష్టత్వం కల్పించింది. కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని ఇదే సందర్భంలో వార్తలు వస్తున్న్తాయి. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వివాదం మరింత ముదిరి పరిస్థితి కనిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle