newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఇంగ్లీష్ సరే.. తెలుగు మీడియం స్కూళ్ల గతేంటి?

07-11-201907-11-2019 09:54:13 IST
2019-11-07T04:24:13.525Z07-11-2019 2019-11-07T04:24:07.506Z - - 20-11-2019

ఇంగ్లీష్ సరే.. తెలుగు మీడియం స్కూళ్ల గతేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ పాఠశాలలన్నింట్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషును బోధనా భాషగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్రమైన వివాదాలకు దారితీస్తోంది. విద్యావేత్తలు, టీచర్లలో ఒక సెక్షన్ ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తుండటంతో వివాదం రగులుకుంటోంది. ప్రభుత్వానికి ఇంగ్లీషు పిచ్చి పడితే పట్టనివ్వండి... కానీ ఇంతవరకు నడుస్తున్న తెలుగు మీడియం స్కూళ్లన్నింటినీ మూసేస్తారా అంటూ విద్యారంగ నిపుణులు మండిపడుతున్నారు. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లన్నింటిలో ఇంగ్లీషును బోధనా భాషగా చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషును బోధనాభాషగా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా 9, 10 క్లాసులకు మాత్రం 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషును బోధనా భాషగా చేయనున్నారు.  అయితే అన్ని పాఠశాలల్లో తెలుగు, ఉర్దూలను తప్పనిసరిగా సబ్జెక్టుగా చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అయితే ప్రభుత్వ నిర్ణయం ఒక సెక్షన్ విద్యావేత్తలు, టీచర్ల విమర్శలను ఎదుర్కొంటోంది. ఆంద్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వ నిర్ణయంలో తప్పు ఉన్నట్లు చెప్పారు. విద్యాబోధన ప్రాథమిక పాఠశాలలవరకైనా మాతృభాషలోనే కొనసాగించాలంటూ కస్తూరి రంగన్ కమిటీ గతంలో చేసిన ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకంగా ఉందని ఆయన ఎత్తి చూపారు. పైగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మార్చడం అనేది జాతీయ విద్యావిధానానికి భిన్నంగా ఉందని, ప్రభుత్వ నిర్ణయం పెడధోరణితో ఉందని చెప్పారు.

పైగా క్షేత్రస్థాయిలో కనీసం కృషి చేయకుండానే ఇంగ్లీషును బోధనా భాషగా ప్రవేశపెట్టడంపై వైకాపా ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగు, ఉర్దూ మీడియం స్కూళ్ల ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఇంతవరకు ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన సాగిస్తున్న తమకు ఇంగ్లీషులో బోధించే నైపుణ్యాలు లేవని వీరు చెబుతున్నారు. నూతన విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమైనందున కొత్త పనివిధానానికి సిద్ధం కావాలంటే తమకు ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉందని విజయవాడకు చెందిన టీచర్ ఒకరు విచారం వ్యక్తం చేశారు. 

మరోవైపున ఐక్య ఉపాధ్యాయుల సమాఖ్య (యూటీఎఫ్) ప్రభుత్వ ఆదేశాన్ని ఖండిస్తూ తెలుగు మీడియం స్కూళ్లను కొనసాగించాలని డిమాండ్ చేసింది. తెలుగు మాట్లాడే రాష్ట్రంలో ప్రభుత్వం బోధనా భాషగా తెలుగును తొలగించి ఇంగ్లీషును ప్రాథమిక స్థాయి నుంచి ఎలా అమలు చేస్తుందని యూటీఎఫ్ ప్రదాన కార్యదర్శి బాబు రెడ్డి ప్రశ్నించారు. బలహీన వర్గాల నుంచి వస్తున్న విద్యార్థులను ఇంగ్లీషు మీడియం దారుణంగా దెబ్బతీస్తుందని, దీనివల్ల బడి ఎగ్గొట్టేవారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle