newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

ఇంగ్లీష్ విద్య‌పై ఇద్ద‌రూ ఇరుకున్నారు..!

11-11-201911-11-2019 09:09:57 IST
2019-11-11T03:39:57.598Z11-11-2019 2019-11-11T03:06:29.205Z - - 20-01-2020

ఇంగ్లీష్ విద్య‌పై ఇద్ద‌రూ ఇరుకున్నారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాటి నుంచి విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌లపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో విద్యా నాణ్య‌త పెంచాల‌ని భావిస్తోంది. స్కూళ్లలో మౌళిక వ‌స‌తులు మెరుగు ప‌రుస్తోంది. ఇందు కోసం నాడు - నేడు పేరుతో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్నే ప్రారంభించ‌బోతోంది.

విద్యా రంగంపైన జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన జ‌గ‌న్ ఇందుకోసం స‌ల‌హాదారుగా తెలంగాణ‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళిని నియ‌మించుకున్నారు. నిర‌క్ష‌రాస్య‌త శాతాన్ని త‌గ్గిస్తాన‌ని ప‌దేప‌దే చెబుతున్న జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం చుర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియం మాత్ర‌మే బోధించాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, దీని వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, విద్యార్థులు ఒకేసారి ఇంగ్లీష్‌లోకి మారితే చ‌ద‌వ‌డం క‌ష్ట‌మవుతుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రేమో తెలుగును చంపేస్తారా అనే ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.

రాజ‌కీయంగా జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను విమ‌ర్శించ‌డ‌మే క‌ర్త‌వ్యంగా భావిస్తున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఈ విష‌యంలో ఇరికిపోయారు. వీరిద్ద‌రూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. వాస్త‌వానికి గ‌తంలో మున్సిప‌ల్ స్కూళ్ల‌లో తెలుగుదేశం ప్ర‌భుత్వం కూడా ఇలానే ఇంగ్లీష్‌ను త‌ప్ప‌నిస‌రి చేసే ప్ర‌య‌త్నం చేస్తే అప్ప‌టి ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ఇలానే వ్య‌తిరేకించింది. ఇప్పుడు టీడీపీ కూడా అదే ప‌ని చేస్తోంది.

దీంతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబు త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్‌ను కూడా తెలుగు మీడియంలో చ‌దివిస్తారా అని ప్ర‌శ్నించారు.

వీరి కౌంట‌ర్ బాగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ విష‌యంపై కొంత ఆల‌స్యంగా స్పందించినా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఆయ‌న వ్య‌తిరేకించారు.

ఈ మేర‌కు ట్వీట్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తెలుగును కాపాడాల‌ని, ప్ర‌భుత్వానికి త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా, ఈ ట్వీట్ ఆయ‌న ఇంగ్లీష్‌లో చేయ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ ట్వీట్‌పై అంత‌గా సానుకూల‌త ల‌భించ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిప్రాయాన్ని చాలామంది వ్య‌తిరేకిస్తున్నారు.

ప‌వ‌న్ త‌ను ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చ‌దివిన ఆధారాల‌ను, గ‌తంలో త‌న కుమారుడు చ‌దివే ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ గురించి ప్ర‌మోట్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియంలో వైర‌ల్ అయ్యింది.

వారి పిల్ల‌లు ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వాలి కానీ పేద‌ల పిల్ల‌లు తెలుగు మీడియంలో చ‌ద‌వాలా అనే ప్ర‌శ్న‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. దీంతో ఇంగ్లీష్ మీడియం వ్య‌వ‌హారంలో ఈ ఇద్ద‌రు నేత‌లు తీసుకున్న స్టాండ్‌కు సానుకూల‌త కంటే వ్య‌తిరేక‌త‌నే ఎక్కువ క‌నిపించింది.

అయితే, జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ప‌లువురు విద్యారంగ నిపుణులు, భాషావేత్త‌లు కూడా వ్య‌తిరేకిస్తూ కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి పిల్ల‌లు మారితే వారు చ‌ద‌వ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని, ఇంగ్లీష్‌లో బోధించే ఉపాధ్యాయుల కొర‌త ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు.

ద‌శ‌ల‌వారీగా ఇంగ్లీష్‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఆస‌క్తి ఉన్న వారు తెలుగు మీడియంను కూడా ఎంపిక చేసుకునే అవ‌కాశం క‌ల్పించాలని కోరుతున్నారు. దీనిపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle