newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇంగ్లీష్ మీడియంకు మత మార్పిడికి లింక్ పెట్టిన కన్నా

13-11-201913-11-2019 10:56:14 IST
2019-11-13T05:26:14.848Z13-11-2019 2019-11-13T05:26:11.589Z - - 15-12-2019

ఇంగ్లీష్ మీడియంకు మత మార్పిడికి లింక్ పెట్టిన కన్నా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు భాషాపరమైన మంట రగిలిపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలో తెలుగు మీడియంను రద్దు చేసి కేవలం ఇంగ్లీష్ మీడియంను మాత్రమే బోధించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇది కూడా జగన్ సర్కార్ ముందూ వెనుకా చూడకుండా తీసుకున్న నిర్ణయమేనని మంత్రుల తడబాటులో అర్ధమవుతుంది.

ముందుగా వచ్చే ఏడాది 1 నుండి 8 తరగతి వరకు అని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఆరవ తరగతి వరకే వచ్చే ఏడాది అమలు చేస్తామని.. ఆ తర్వాత ఏడాది నుండి పెంచుకుంటూ పోతామని చెప్పింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందిస్తామని చెప్తున్నా బోధించే ఆంగ్ల ఉపాధ్యాయుల నుండి ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వంటి టెక్నీకల్ సమస్యలు చాలానే ఉన్నాయి.

వీటన్నిటికీ కాసేపు పక్కన పెడితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు నుండి తెలుగు భాషా సంఘాల వరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దక్షణాది రాష్ట్రాలన్నీ తమ భాషలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తెలుగు భాషను పీకపిసికి చంపేసేందుకు సిద్ధమైందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ అయితే ఇంగ్లీష్ మీడియంకు మత మార్పిళ్లకు లింకు పెడుతుంది.

రాష్ట్రంలో తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియంను రుద్దడం మత మార్పిళ్ళని ప్రోత్సహించడం కోసమేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. హిందూ సంప్రదాయం.. సంస్కృతి అన్నది తెలుగు బాషతోనే ముడిపడి ఉంటుందని.. భాషను చంపడంతో సంస్కృతి, సంప్రదాయాలను కూడా లేకుండా చేయాలనే ఈ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను తెరమీదకి తెస్తుందన్నారు.

జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా ఈ ప్రభుత్వ విధానాలు అర్ధమవుతాయన్న కన్నా ఇంగ్లీష్ భాషతో పాటు మత మార్పిళ్లను ఈ ప్రభుత్వం బలవంతంగా రుద్దాలని చూస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి భాషను, ధర్మాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉందని కన్నా అభిప్రాయపడ్డారు.

అయితే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినంత మాత్రాన మత మార్పిళ్లు జరిగిపోతాయా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేయడం వలన మత మార్పిళ్ల సంగతెలా ఉన్నా తెలుగు భాష.. మమకారం.. సంస్కృతి దూరమైతే విద్యార్థులు ప్రాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయే అవకాశం ఉందని మాత్రం మేధావులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం తల్లి భాషను బ్రతికించుకుంటూనే ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాన్ని పెంచి ప్రజా మనుగడకు ఉపయోగపడాలి కానీ ఇలా మాతృబాషను చంపడం భావ్యం కాదని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ వాదనలను పట్టించుకుంటుందా?!

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle