newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ఇంగ్లీష్ చదువులు లేకపోతే సర్వనాశనం.. జగన్‌ది ముందుచూపేనా?

15-11-201915-11-2019 10:44:52 IST
Updated On 15-11-2019 16:24:28 ISTUpdated On 15-11-20192019-11-15T05:14:52.702Z15-11-2019 2019-11-15T05:14:50.453Z - 2019-11-15T10:54:28.080Z - 15-11-2019

ఇంగ్లీష్ చదువులు లేకపోతే సర్వనాశనం.. జగన్‌ది ముందుచూపేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో సకల ప్రతిపక్షాలూ ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా వద్దని ఇల్లెక్కి కూస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెబుతూ వస్తున్నారు. వచ్చే ఏడాదినుంచి 1-6 తరగతులకు ఇంగ్లిష్ మీడియం చదువు మాత్రమే ఉంటుందంటున్న ప్రభుత్వ విధానాన్ని వెనక్కు తిప్పే ఛాన్సే లేదని సీఎం ప్రతి సందర్భలోనూ నొక్కి చెబుతున్నారు. పైగా తన అభిప్రాయాన్ని మంత్రుల చేత కూడా నిత్య పారాయణం చేస్తున్నారు. 

కారణం ఒక్కటే.. తాను తీసుకున్న నిర్ణయం నిరుపేదలకు మేలు చేసేది అని జగన్ దృఢంగా నమ్ముతున్నారని వినికిడి. పైగా ఇంగ్లీషు నేర్చుకోకపోవడం ద్వారా ఎంత ఇబ్బందులు పడుతున్నామో మీకేం తెలుసు అంటూ బొత్స వంటి మంత్రుల చేత కూడా జగన్ చెప్పిస్తున్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది ముఖ్యమంత్రి వ్యక్తిగత మొండిపట్టు ఏమాత్రం కాదని తాజాగా మనబడి - నాడు నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా తెలియవచ్చింది.

జగన్ ఇంగ్లీషు భోధనా మాధ్యమంపై తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోవకపోవడానికి రెండు బలీయమైన కారణాలున్నాయని తెలిసింది. ఒకటి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం రోబోటిక్స్ రాజ్యమేలుతుందని.. ఇంగ్లిషు చదువులు లేకపోతే.. మన పిల్లలు ఇంకా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని జగన్ గ్రహించారట. సాఫ్ట్ వేర్ రంగంలో అద్భుత విజయం సాధించిన మన మధ్యతరగతి తెలుగు కుటుంబాలు రెండు తరాలను ఎలా ప్రభావితం చేస్తూ వస్తున్నారో అందరికీ తెలిసిందే.

రేపటి ప్రపంచాన్ని రోబోటిక్స్ ఏలడం ఖాయం అని నిర్ధారణ అవడంతో మన మధ్యతరగతితో పాటు దిగువతరగతి పిల్లలు కూడా ఆ విప్లవాన్ని అందుకోవాలంటే యుద్ధప్రాతిపదికపై బోధనా మాధ్యమాన్ని ఇంగ్లిషుకు మార్చాలని పదేళ్ల తర్వాత కొత్తతరం ఆధునిక ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే బోధనా మాధ్యమాన్ని మార్చడమే పరిష్కారమని జగన్ గ్రహించినట్లు తెలుస్తోంది.

దీనికంటే కార్పొరేట్ విద్యావ్యవస్థ నడ్డి విరవడం తన లక్ష్యంగా జగన్ పరోక్షంగా ప్రకటించారు. కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయడం తన విధానం కాదని సీఎం ప్రకటించారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ స్థాయిలో ఉందో.. అందరికీ తెలుసు. పిల్లలకు మంచి చదువులు వస్తాయనే భ్రమలో కార్పొరేట్ స్కూళ్ల విషవలయాల్లోకి పిల్లల్ని నెట్టేసి నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. పైగా ఏపీలో స్కూలు పిల్లల తల్లులకు ప్రతి ఏడాది డబ్బు ఇస్తున్నారు. ఆ పథకాన్ని ప్రెవేటు పాఠశాలలకు కూడా వర్తించేలా అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ స్కూళ్లకు మాత్రం ఇస్తే, ఇంగ్లిషు మీడియం ఆశపడే పిల్లల తల్లిదండ్రులకు సాయం అందించరా? అనే విమర్శలు వస్తాయి. అందుకే తొలిదశలో అందరికీ నగదు సహాయం ఇచ్చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిషు మీడియం తెస్తున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం వచ్చిన తర్వాత.. ఆర్థిక సహాయం పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే వర్తింపజేస్తే ప్రభుత్వం మీద భారం బాగా తగ్గుతుంది. కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. 

ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా, బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును అమలు చేయడంలో జగన్ పెట్టుకున్న వ్యూహాత్మక ప్రణాళిక ఇదన్నమాట. తన నిర్ణయాన్ని తాజాగా కేబినెట్ చేత ఏకగ్రీవంగా ఆమోదించడంలో కూడా జగన్ పట్టుదల కనబడుతోంది.

తెలుగుకు పట్టం కట్టకపోతే మట్టిగొట్టుకుపోతారు అనే పవన్ కల్యాణ్ శాపనార్థాలకు, ఇంగ్లీష్ చదువులు లేకపోతే సర్వనాశనం అయిపోతారు అనే జగన్ ముందస్తు ప్రణాళికకు మధ్య వైరుధ్యాన్ని రాబోయే చరిత్ర పరిష్కరించాల్సిందే మరి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle