newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇంగ్లీషు రాకపోతే వచ్చే ఇబ్బందులు తెలుసు పవన్ : బొత్స

14-11-201914-11-2019 11:34:14 IST
Updated On 14-11-2019 15:41:04 ISTUpdated On 14-11-20192019-11-14T06:04:14.766Z14-11-2019 2019-11-14T06:04:06.886Z - 2019-11-14T10:11:04.042Z - 14-11-2019

ఇంగ్లీషు  రాకపోతే వచ్చే ఇబ్బందులు తెలుసు పవన్ : బొత్స
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడు సార్లు వివిధ ముఖ్యమంత్రుల హయాంలో తాను పనిచేశానని, ఇంగ్లీష్ రాకపోతే, ఆ భాషలో మాట్లాడటం తెలీకపోతే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయా తనకు అనుభవపూర్వకంగా తెలుసని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా భాషగా చేస్తూ ప్రభుత్వం  చేపట్టిన విధానాన్ని ఎవరైనా విమర్శించవచ్చని కానీ ముఖ్యమంత్రి మట్టిగొట్టుకు పోతాడంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూషించడం విమర్శలో భాగమేనా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.

బుధవారం విజయవాడలోని విశాలాంధ్ర బుక్ షాపును సందర్సించి నాటకీయంగా తెలుగు పుస్తకాలను కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింట్లోనూ బోధనా భాషగా ఇంగ్లిషును ప్రవేశపెడతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పరుష వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రితో పాటు వైకాపాకు చెందిన 150 మంది ఎమ్మెల్యేలు కూడా మట్టిగొట్టుకుపోతారని శాపనార్ధాలు పెట్టారు. 

ముఖ్యమంత్రి ప్రకటనపై, ప్రభుత్వ విధాన నిర్ణయంపై పవన్ కల్యాణ్ విజయవాడలో చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని దానిపై ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే చెప్పాలే తప్ప మట్టిగొట్టుకుపోతారు, తోలు తీస్తాం వంటి మాటలు సరికాదని మంత్రి సూచించారు. 

తాను మూడు సార్లు మంత్రిగా పనిచేశానని, ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటోవ్యక్తిగతంగా తనకు తెలుసని బొత్స వ్యాఖ్యానించారు. 

కాగా, తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ బోధనా మాద్యమంగా ఇంగ్లీషును అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెడతామని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న బోధనా మాధ్యమ విధానంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశాన్ని శాసించే వ్యక్తులే భాష విషయమై తీవ్ర ప్రకటనలు చేసి తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గారని, ఊరికి ఒక్క విద్యార్థి ఉన్నా సరే తెలుగును బోధనా భాషగా కొనసాగించాల్సిందేనని పవన్ పేర్కొన్న సందర్భంగా మాతృభాషకు అన్యాయం చేస్తే ముఖ్యమంత్రి, వైకాపా ఎమ్మెల్యేలు మొత్తంగా మట్టి కొట్టుకుపోతారని పవన్ పరుష వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఆంగ్ల మాధ్యమంపై నిర్ణయం మాతృభాషగా తెలుగు మనుగడకు ముప్పు తెస్తుందని అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం శాఖ అధ్యక్షులు జీఎస్ చలం వ్యాఖ్యానించారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle