newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఇంగ్లీషు కాదు... హద్దులు దాటుతున్న విమర్శలే సమస్య -2

12-11-201912-11-2019 12:58:27 IST
Updated On 12-11-2019 15:14:46 ISTUpdated On 12-11-20192019-11-12T07:28:27.613Z12-11-2019 2019-11-12T07:28:25.417Z - 2019-11-12T09:44:46.286Z - 12-11-2019

ఇంగ్లీషు కాదు... హద్దులు దాటుతున్న విమర్శలే సమస్య -2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

అందుకే భాషా మాధ్యమం విషయంలో ప్రతిపక్ష నేతల కపటత్వంపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. అయితే ప్రతిపక్ష నేతలవ్యాఖ్యలపై స్పందించేటప్పుడు కాస్త హుందాతనాన్ని జగన్ పాటించి ఉంటే ఇంత రచ్చకు అవకాశం ఉండకపోయేది. ప్రతిపక్ష నేతల కపటత్వం విషయంలో జగన్ విమర్శ నూటికి నూరు పాళ్లూ సరైందే. మాతృభాషలో చదువుతూనే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతిగా తానూ, ప్రధాని నరేంద్రమోదీ వంటి వారు ఈ స్థాయికి వచ్చారని వాదించిన వెంకయ్య నాయుడికి కూడా జగన్ అదే ప్రశ్న సంధించారు. మీ మాతృభాషా చదువుల గొప్పతనం సంగతి సరే. మీ బిడ్డలను ఏ పాఠశాలల్లో చదివించారు స్వామీ అంటూ జగన్ సంధించిన ప్రశ్నలో తప్పేమీలేదు. 

ఎందుకంటే తమ  పిల్లలకు కాన్వెంట్ చదువులు చెప్పించడంపై తమ మమకారాన్ని వెంకయ్య నాయుడే కాదు ఎవరైనా సరే దాచి ఉంచలేరు. ఇదే కపటత్వం అంటే. వేలు లక్షలు పోసి ప్రాథమిక విద్య నుంచి ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలల్లో పిల్లలను చదివించడంలో మన దేశ రాజకీయ నేతలు, ఎగువ మధ్యతరగతి వర్గాలది అందె వేసినచెయ్యి. అలాగే ఉపాధ్యాయ యూనియన్లు కూడా ఈ  విషయంలో దొంగలే అని చెప్పాలి. తాము బోధించేది తెలుగు మీడియంలో.. తమ పిల్లలను దింపేది మాత్రం ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో.. ఈ కపటత్వాన్ని ఎవరూ ప్రశ్నించిది లేదు. ఈ విషయంలో అంతా గురువింద గింజలే.

ఈ కపటత్వాన్నే జగన్ ప్రశ్నించారు. సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే హక్కు భుక్తం అవుతున్న ఇంగ్లీషు మీడియంను రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా సార్వత్రికంచేస్తూ సకల వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచుతూ జగన్ విధాన ప్రకటన చేశారు. కానీ తాను సదుద్దేశంతో తీసుకువచ్చానని భావించిన ఇంత కీలకమైన విధానంపై ప్రతిపక్షాల వరుస దాడులను ఎదుర్కోవడంలో వ్యక్తిగత విమర్శ చేయకుండా హుందాతనాన్ని ప్రదర్శించడంలో జగన్ తప్పటడుగేశారు. చంద్రబాబును ఉద్దేశించి నీ కొడుకు, నీ మనవడు అనీ, వెంకయ్య అనీ ఏకవచన ప్రయోగం చేయడం అనవసర విమర్శలకు దారి తీయడమే కాదు ప్రభుత్వాధినేత స్థాయిని పలుచన చేసింది. 

ఇక పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యల ప్రస్తావనను జగన్ తీసుకురావడం ఏరకంగా చూసినా సమర్థనీయం కాదు. ఇన్నాళ్లుగా తన ప్రభుత్వంపై దాడి మీద దాడి చేస్తున్న పవన్‌ను చితకబాది పడేయాలన్నంత ఆగ్రహంతో జగన్ చేసిన విమర్శ తనకే బూమెరాంగ్ లాగా వచ్చి తగిలింది. మీ పిల్లలను ఏ స్కూలులో వేశావు పవనూ అని అడిగి ఉంటే ఎలా ఉండేది. మీకు ముగ్గురు భార్యలు.. వారికి ఏ నలుగురయిదుగురో పిల్లలూ అంటూ వ్యక్తిగతం లోకి సీఎం స్థాయిలోంచి జారిపోవడం సబబు మాత్రమే కాదు.. దాంతో  ప్రభుత్వాధినేత ప్రతిష్టకు భంగం కలిగించినట్లే... 

అందుకే జగన్ వ్యాఖ్యల పట్ల జనసేన అధిపతి తీవ్రంగా నొచ్చుకున్నట్లుంది. తన వ్యక్తిగత జీవితంపై సీఎం దాడి చేశారని పవన్ చెప్పడం వెంటనే  జనసేన సోషల్ మీడియా సేన దాడి మొదలెట్టడం జరిగిపోయింది. పవన్ కల్యాణ్ బహుళ వివాహాల వల్లే మీ దొంగల ముఠా జైలు కూడు తినాల్సిరావడం నిజమేనా జగనూ అంటూ జనసేన సోషల్ మీడియా ప్రతిదాడి చేసింది.

జగన్‌చేసిన దాడికి అంతకుమించిన వ్యక్తిగత దాడి చేయడంలో జనసేన సోషల్ మీడియా తక్కువేం తినలేదు. సీఎం కామెంట్లకు ఏమాత్రం తీసిపోనని, అంతకు అంతా చెల్లించడంలో తాను మొనగాడినని ప్రదర్శించుకోవడానికి పవన్ ఇంత దూకుడు ప్రదర్శించి ఉండవచ్చు. కానీ తర్వాత జనసేన పార్టీ తన శ్రేణులకు అప్పీలు చేస్తూ పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ వ్యాఖ్యల పట్ల స్పందించవద్దని ప్రకటన చేసింది. 

నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ చేస్తున్న పోరాటాన్ని దారి మళ్లించడానికే  సీఎం ఇలా విమర్శించారని, ఈ వ్యక్తిగత విమర్శలను ప్రజల సంక్షేమం కోసం సహించాలే కానీ ప్రతి విమర్శలు చేయవద్దని జనసేన ప్రకటించింది. అంతే తప్ప జగన్ చిప్పకూడు తినడం పట్ల తన సోషల్ మీడియా చేసిన వ్యాఖ్య  పట్ల జనసేన ప్రకటన కించిత్ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. పాలసీలపై విమర్శ పేరుతో తన బహిరంగ సమావేశాల్లో అధికార పక్షం నేతలపై ఏ స్థాయిలో పవన్ కల్యాణ్ దాడి చేస్తారో జగమెరిగిన సత్యమే. తాను ఎవరినైనా ఎక్కడైనా ఎలాంటి కామెంట్లతో అయినా సత్కరించవచ్చు. కానీ తననెవరూ పల్లెత్తు మాట అనకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే 'శతఘ్ని'ని రంగంలోకి దింపుతా అనడం మరొ రకమైన నిందారాజకీయాల్లో భాగమే. 

ఇవన్నీ పక్కన బెడదాం.. ఎందుకంటే తెలుగు రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయనడంలో సందేహమే లేదు. కానీ ఇంగ్లీషు మీడియంలో బోధన అనే అంశంపై చెలరేగిన వాదోపవాదాలు చివరకు అసలు విషయాన్ని  పక్కన బెట్టి నాయకుల కొడుకులు, మనవళ్లు, భార్యలు, వారి పిల్లలను కెలుక్కోవడం వద్దే ఆగిపోయాయి తప్పితే తమ పిల్లలను ఇంగ్లీషు చదువుల్లో దింపుతూ కింది తరగతుల పిల్లలకు ఇంగ్లీషును శాశ్వతంగా దూరం చేస్తూ వస్తున్న అమానుష మైన కపటనీతి విషయంలో వీరెవరూ తమవైపు తాము చూసుకోవడం లేదు. పాలకులు, వారి బిడ్డలు, వారి వారసులు ఇంగ్లీషు చదువుల్లో తరిస్తూ ప్రత్యేక పాలక వర్గంలాగా తయారవుతున్నారని,  ఇంగ్లీషు చదువులకు దూరమైన వర్గాలు వారి పిల్లలు ఈ దేశంలో తరాలుగా రెండో తరగతి పౌరులుగా కొనసాగుతున్నారని బహుజన వర్గాల మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య చేస్తున్న వాదనలను మన రాజకీయ కపట నేతలు నేటికీ నిరూపిస్తూనే ఉన్నారు.

''మీ పిల్లలను వారి పిల్లలను ఏ చదువుల్లో దింపుతున్నారు బాసూ..'' ఏపీ రాజకీయ నేతల కపటత్వంపై ప్రభుత్వాధినేత సంధించిన అసలు ప్రశ్న ఇంకా సమాధానానికి నోచుకోలేదు. నాయకులు, వారి కుమారులు, భార్యల ప్రస్తావన వద్దే నిలిచిపోయిన ఈ కీలక ప్రశ్నకు సమాధానం వస్తుందని కూడా ఆశించలేం. ఇదే అసలైన కపటత్వం. ఇలాంటి బరితెగించిన కపటత్వంపై యుద్ధం సరిగా చేయకుంటే అసలు సమస్య పక్కదోవలు పట్టి కపటత్వమే గెలుస్తుందని కూడా ఇంగ్లీషు మీడియం ఉదంతం మరోసారి తేల్చి చెప్పింది.

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle