newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

ఇంగ్లిష్‌ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దు.. బాబు ఆంక్షలు

23-11-201923-11-2019 17:01:15 IST
Updated On 23-11-2019 17:20:22 ISTUpdated On 23-11-20192019-11-23T11:31:15.623Z23-11-2019 2019-11-23T11:12:13.239Z - 2019-11-23T11:50:22.042Z - 23-11-2019

ఇంగ్లిష్‌ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దు.. బాబు ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికీ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల్లో తమ వైఖరి పట్ల పెరిగిన వ్యతిరేకతను పసిగట్టినట్లుంది. తెలుగును ప్రభుత్వ పాఠశాలల్లోంచి తీసివేస్తే ఎంతకైనా వెళతామని ప్రతిజ్ఞసలు చేస్తూ వచ్చిన చంద్రబాబు ఉన్నట్లుండి కొత్త పల్లవి అందుకున్నారు. ఇంగ్లిష్‌ మీడియం విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని గమనించారు. పేద ప్రజల బాగు కోసం ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అభిప్రాయం బలపడిందని వార్తలు రావడంతో అప్రమత్తమైన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు, నేతలకు గట్టిగానే ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్‌ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో తాజా పరిణామాలపై చర్చించిన చంద్రబాబు తాజాగా ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు.

ఇంగ్లిష్‌ మీడియం విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్ని అడ్డుకుంటున్నామనే భావన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఏర్పడిందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంగ్లిష్‌ మీడియం బోధనకు టీడీపీ వ్యతిరేకం కాదని, దానిని ప్రవేశపెట్టింది టీడీపీయేనని ప్రచారం చేయాలని సూచించారు. 

ఇంగ్లీషు మీడియం విషయంలో చంద్రబాబు మారిన వైఖరి అధికార పక్షానికి ఆయుధాన్ని అందించినట్లయింది. ఇంగ్లిష్‌ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు గుర్తించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా 16న ధర్నా చేస్తానని హెచ్చరించిన బాబు 22వ తేదీ నాటికి పూర్తిగా మాటమార్చి యూటర్న్‌ తీసుకున్నాడని పేర్ని నాని తెలిపారు. తాము ఆంగ్లానికి వ్యతిరేకం కాదని, ఎప్పుడో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టామని, కానీ అప్పట్లో వైఎస్‌ జగన్‌ అడ్డుకున్నారని చంద్రబాబు మాట్లాడటం విని ప్రజలు నవ్వుకొంటున్నారని మంత్రి పేర్ని అన్నారు.

పవన్‌ నాయుడు ఎన్నికల సమయంలో నెల్లూరులో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చదివానని చెప్పారని, క్రిస్టియన్‌ మతం చాలా గొప్పదని, నెల్లూరులో మిషనరీ స్కూల్‌ తనకు దేశభక్తి నేర్పిందని ఆయనే అన్నాడని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పెడితే కన్నా లక్ష్మీనారాయణ మతం రంగు పులుముతారని  పేర్ని నాని ధ్వజమెత్తారు.

మొత్తం మీద ప్రభుత్వ కీలక విధానంపై గుడ్డిగా వ్యతిరేకత తెలిపితే పేదవర్గాల్లో అసంతృప్తి బీజాలు ఏర్పడే ప్రమాదాన్ని చంద్రబాబు త్వరలోనే పసిగిట్టినట్లుంది. అధికార పక్షం  యూటర్న్ అంటున్నా వాస్తవాలు గమనించాక వైఖరిని మార్చుకోక తప్పదని, ఏటికి ఎదురీదటం అన్ని వేళల్లో పనికిరాదని చంద్రబాబు గ్రహించినట్లుంది.

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   3 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   4 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   4 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   8 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   10 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   13 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   13 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   14 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   14 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle