newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇంకా వేడి చల్లారడం లేదు..!

15-04-201915-04-2019 08:05:53 IST
Updated On 15-04-2019 17:29:33 ISTUpdated On 15-04-20192019-04-15T02:35:53.786Z15-04-2019 2019-04-15T02:35:48.844Z - 2019-04-15T11:59:33.469Z - 15-04-2019

ఇంకా వేడి చల్లారడం లేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా మంటలు చల్లారడం లేదు. పార్టీల నేతలు మీడియా ముఖంగా, క్యాడర్ సోషల్ మీడియాలో ఇంకా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘంపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించారు. వివిధ పార్టీల మద్దతు కూడగట్టి ఎన్నికల సంఘం తీరుపై పోరాడుతున్నారు.

ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసారు. రెండు రోజులుగా ఢిల్లీలో ఆయన ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. వివిధ పార్టీల నేతలతోనూ ఈ విషయం చర్చిస్తూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇక, చంద్రబాబు నాయుడుకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఓటమి భయంతో ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇక, ఎన్నికల సమయంలో పరస్పరం దాడులు జరిగిన గ్రామాల్లో ఇంకా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులపై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్‌పై గ్రామస్థులు దాడి చేసిన ఘటనలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు భయపడి గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.

వైసీపీ కూడా తమ అభ్యర్థులపై దాడులు జరిగిన ఘటనలపై పార్టీ తరపున నిజానిజాలను వెలుగులోకి తీసుకురావడానికి పార్టీ నేత మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేసింది. తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, తమ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలను వదిలేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సైతం ఇంకా ఎన్నికల ఫీవర్ నుంచి బయటకు రాలేదు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయవాడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు చేసిన విమర్శలను పర్సనల్‌గా తీసుకున్నారు. తనపై విమర్శలు చేసిన వారిని, తప్పుడు వార్తలు రాసిన వారిని కోట్లు ఖర్చైనా సరే వారి కొవ్వు కరిగే వరకు కోర్టుల చుట్టూ తిప్పుతానని సవాల్ చేస్తున్నారు. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని‌కలు ముగిసినా ఎన్నికల వేడి మాత్రం ఇంకా తగ్గలేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle