newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఇంకా పాత ప‌ద్ధ‌తిలోనే జ‌గ‌న్‌..!

24-09-201924-09-2019 11:30:29 IST
Updated On 24-09-2019 11:51:58 ISTUpdated On 24-09-20192019-09-24T06:00:29.651Z24-09-2019 2019-09-24T06:00:27.109Z - 2019-09-24T06:21:58.025Z - 24-09-2019

ఇంకా పాత ప‌ద్ధ‌తిలోనే జ‌గ‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చి 100 రోజులు గ‌డిచిపోయింది. త‌క్కువ రోజుల్లోనే ఆయ‌న పాల‌న‌పై అనేక ప్ర‌శంస‌లు, విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌లు కీల‌క‌, చారిత్ర‌క నిర్ణ‌యాల‌ను ఎటువంటి బెర‌కు లేకుండా తీసుకుంటున్న జ‌గ‌న్ కొంద‌రి ప్ర‌శంస‌ల‌ను, మ‌రికొంద‌రి విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఆరు నెల‌ల వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌నితీరును ప‌రిశీలించాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యించిన ప్ర‌తిప‌క్షాలు నెల రోజులకే జ‌గ‌న్ స‌ర్కార్‌పై యుద్ధాన్ని ప్రారంభించాయి. ప్ర‌జావేదిక కూల్చివేత‌, విత్త‌నాల కొర‌త‌, ఇసుక కొర‌త‌, టీడీపీ శ్రేణుల‌పై దాడులు, కేసులు, రివ‌ర్స్ టెండ‌రింగ్‌, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య‌, గ్రామ స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై తెలుగుదేశం పార్టీ అనేక ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఎన్నిక‌లు అయిపోయిన నాటి నుంచి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తీరోజూ సోష‌ల్ మీడియా ద్వారానో, మీడియా సమావేశాలు లేదా పార్టీ స‌మావేశాల్లో మాట్లాడుతూ ప్ర‌తీరోజు వార్త‌ల్లో నిలుస్తున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక‌, ఆయ‌న‌తో పాటు ట్విట్ట‌ర్‌లో నారా లోకేష్‌, మీడియా స‌మావేశాల్లో ప‌లువురు మాజీ మంత్రులు, టీడీపీ నేత‌లు ప్ర‌తీ రోజూ ప్ర‌భుత్వంపై, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జాతీయ మీడియాలోనూ చంద్ర‌బాబు త‌న వాద‌న‌ను వినిపించ‌గ‌లుగుతున్నారు.

కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై మూడు రోజులు వ‌రుస‌గా చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడి ప్ర‌భుత్వం చేసిన హ‌త్య అని ఆరోపించారు. జ‌న‌సేన‌, బీజేపీ కూడా ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇంచుమించు టీడీపీ చేసే ఆరోప‌ణ‌ల‌ను ఆ పార్టీలు కూడా చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌కు జ‌వాబు ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాత్రం ఏ మాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఎంత తీవ్ర‌మైన అంశ‌మైనా, ప్ర‌భుత్వంపై ఏ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

కేవ‌లం పార్టీ నేత‌లో, మంత్రులో మీడియా ముందుకొచ్చి ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లోకి ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు వెళ్లినంత బ‌లంగా ప్ర‌భుత్వ వాద‌న వెళ్ల‌డం లేదు. చంద్ర‌బాబు నాయుడు ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వారంలో రెండుమూడు సార్లు మీడియాతో మాట్లాడే వారు. వైసీపీ చేసే విమ‌ర్శ‌ల‌కు ఆయ‌నే నేరుగా కౌంట‌ర్ ఇచ్చే వారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై, ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు మీడియా ద్వారా వివ‌రించే వారు.

కానీ జ‌గ‌న్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ప్ర‌భుత్వ నిర్ణ‌యాలపై మీడియాతో మాట్లాడ‌లేరు. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిన స‌మ‌యాల్లోనూ కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా జ‌గ‌న్ మీడియాతో ప‌రిమితంగానే ఉండేవారు. అప్పుడు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉంటూ నేరుగా త‌న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల్లోకి కూడా ఎక్కువ‌గా వెళ్ల‌డం లేదు.

ఈ స‌మ‌యంలో త‌ర‌చూ కాకున్నా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్పుడు, తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడైనా ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు త‌న వాద‌న తీసుకెళ్ల‌క‌పోతే ప్ర‌భుత్వానికి కొంత న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle