newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

17-11-201917-11-2019 20:51:13 IST
2019-11-17T15:21:13.070Z17-11-2019 2019-11-17T15:21:06.186Z - - 15-08-2020

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంగ్లీషు మీడియం వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ విష‌యంలో కొంద‌రు రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయానికి వంద‌కు వంద మార్కులు వేస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒక‌రు మ‌ళ్లీ వార్తల్లొకెక్కారు.

ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్ర‌వేశ‌పెడ‌తామంటూ జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ వ్య‌తిరేకిస్తుంటే.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం మ‌ద్ద‌తిస్తూ వ‌స్తున్నారు.

సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విష్ణుకుమార్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడారు. మ‌నం ఎంత‌సేపూ ఆంధ్రాలోనే ఉండాలి అని అనుకుంటే తెలుగు చాలు. హిందీ కూడా అవ‌స‌రం లేదు. మ‌నం హైద‌రాబాద్ వెళ్లాలి, లేదా ఢిల్లీ వెళ్లాల‌నుకుంటే మాత్రం హిందీ, ఇంగ్లీషు త‌ప్ప‌నిస‌రిగా రావాలి. క‌నుక రెండు భాష‌లూ కావాలి.

ప్ర‌పంచం మొత్తం మీద ఎక్కువ మంది మాట్లాడేది ఇంగ్లీషు భాష. ప్ర‌తి ఒక్క‌రికీ మ‌న భావాలు అర్ధం కావాల‌నుకుంటే ఇంగ్లీషు త‌ప్ప‌నిస‌రి. ఇంగ్లీషు అంటే ఏదో ఊరికే పైపైన చ‌ద‌వ‌డం కాదు. మీడియం ఆఫ్ ఎడ్యుకేష‌న్. ఇంగ్లీషు మీడియంలో క‌నుక ఎడ్యుకేష‌న్ ఉంటే అప్పుడే ప్ర‌తి ఒక్క‌రికి ఇంగ్లీషును సుల‌భంగా మాట్లాడ‌గ‌లుగుతారు.. ఇలా విష్ణుకుమార్ రాజు మాట్లాడిన మాట‌లే ఇప్పుడు వైజాగ్ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

విష్ణుకుమార్‌రాజు సీఎం జ‌గ‌న్‌కు అనుకూలంగా ఈ పాజిటివ్ వైబ్రేష‌న్స్ ఎందుకు ఇచ్చారు..? దాని వెనుక ఏమైనా కార‌ణాలు ఉన్నాయా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై రాజ‌కీయ విశ్లేష‌కుల్లో విస్తృత స్థాయి చర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో విష్ణుకుమార్‌రాజు బీజేపీని వీడ వైసీపీలో చేర‌నున్నారేమో..? అన్న అనుమానాల‌ను కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి విష్ణు కుమార్ రాజు కూడా పార్టీ మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఆరుసార్లు ప్ర‌య‌త్నించినా అపాయింట్‌మెంట్ దొర‌కలేద‌ని, జ‌గ‌న్ బిజీ షెడ్యూల్‌లో ఉండ‌టం కార‌ణంగానే త‌న‌ను క‌లిసే అవ‌కాశం రాలేద‌న్న అభిప్రాయాన్ని స్వ‌యాన విష్ణుకుమార్ రాజు వ్య‌క్త ప‌ర‌చ‌డంతో ఆయ‌న‌ వైసీపీ చేరనున్నార‌న్న వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, అస‌లు విష్ణుకుమార్ రాజు సీఎం జ‌గ‌న్‌ను ఎందుకు క‌ల‌వాల‌నుకుంటున్నారు. ఆయ‌న‌కు వైసీపీలో చేరే ఉద్దేశం ఉందా..?  లేదా..? అంటూ కొంద‌రు ఆరా తీస్తున్నారు. విష్ణుకుమార్ రాజుకు ప్ర‌భుత్వం నుంచి రూ.70 కోట్ల బిల్లులు రావాల‌ని, ఆరు నెలలుగా అవి పెండింగ్‌లో ఉండ‌టంతో బిల్లుల క్లియ‌రెన్స్ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ఆ రూ.70 కోట్ల బిల్లులు క్లియ‌ర్ కావాలంటే పార్టీ మారితేగానీ.. బిల్లులు చెల్లించే ప‌రిస్థితి లేద‌న్న‌ది విష్ణుకుమార్‌రాజు వ‌ర్గీయుల మాట‌. ఇందు కోస‌మే ఆయ‌న జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇంత‌కు ముందు కూడా విష్ణుకుమార్ రాజు పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న టీడీపీలో చేరుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అప్పుడు కూడా ఆయ‌న చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు.

దీంతో ఆయ‌న పార్టీ మార్పు వార్త‌లు గుప్పుమ‌న్నాయి.  మొన్న‌టి ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ విష్ణుకుమార్‌రాజు పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఆ వార్త‌ల్లో నిజం ఎంతో తెలియాలంటే  ఆయ‌నే స్పందించాలి. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle